లోకనాయకుడు కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగలబోతున్న భారతీయుడు 2 నష్టాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహకు అందటం లేదు. మాములుగా తమిళనాడులో స్టార్ హీరోల సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా సరే వసూళ్ల పరంగా మరీ దారుణంగా నిరాశ పరచవు. మన దగ్గర ఆడని రజనీకాంత్ పెద్దన్న ఒరిజినల్ వెర్షన్ కలెక్షన్ల పరంగా మంచి నెంబర్లే తీసుకొచ్చింది. అజిత్ తెగింపుకి యావరేజ్ టాక్ వచ్చినా కోలీవుడ్ రికార్డులు కొన్ని బద్దలయ్యాయి. కానీ ఇండియన్ 2కి ఆ ఛాన్స్ దరిదాపుల్లో లేదు. విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కమల్ హాసన్ ఊహించని పరాభవం ఇది.
సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడీ నష్టాలను ఎలా భర్తీ చేస్తారనేది నిర్మాణ సంస్థ లైకా ముందున్న అతి పెద్ద సవాల్. వచ్చే నెల ఇదే బ్యానర్ నుంచి రాబోతున్న అజిత్ విదయమయార్చి నుంచి సర్దుబాటు చేయమని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేస్తున్నారని చెన్నై టాక్. అలా చేస్తే ఇంకా పెద్ద రిస్క్ అవుతుంది. దాని బదులు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న భారతీయుడు 3ని ఆఫర్ చేస్తున్నారని వినికిడి. అంటే సేనాపతి తెచ్చిన లాసులను కథ ప్రకారం మూడో భాగంలో వచ్చే అతని తండ్రి వీరశేఖర్ సేనాపతి తీర్చాలన్న మాట. గతంలో బాలయ్య తీసిన ఎన్టీఆర్ బయోపిక్ కి ఇదే పద్ధతి పాటించారు కానీ వర్కౌట్ కాలేదు.
బయ్యర్లు మాత్రం దీనికి అంత సుముఖంగా లేరని వినికిడి. ఎంత ప్రమోషన్ చేసినా భారతీయుడు 3కి బజ్ ఉండదని, పైగా ట్రైలర్ కొందరికి బాగానే అనిపించినా మరికొందరికి సైరా నరసింహారెడ్డి, మణికర్ణిక తరహాలో మిశ్రమ స్పందన కలిగించిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రిలీజయ్యాక అది సూపర్ హిట్ అయితే అప్పుడు పెరిగే శంకర్ ఇమేజ్ మీద మార్కెట్ చేసుకుందామా లేక గోలంతా ఎందుకు అనుకుని నేరుగా ఓటిటికి ఇచ్చేద్దామా అనే ఆలోచన కూడా లైకా టీమ్ లో ఉందట. మొత్తానికి గంపెడాశలు పెట్టుకుంటే చిటికెడు ఫలితాన్ని ఇచ్చాడు సేనాపతి.
This post was last modified on July 17, 2024 11:31 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…