Movie News

అల్లు అర్జున్ చుట్టూ కొత్త అయోమయం

పుష్ప 2 ది రూల్ విడుదలయ్యేలోపు అల్లు అర్జున్ తర్వాతి సినిమాకు దర్శకుడెవరో తేలాలి. దానికెంతో టైం లేదు. జూలైని మినహాయిస్తే కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయముంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్యాన్ ఇండియా మూవీని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు ఆ స్క్రిప్ట్ మీదే ఉన్నారని టాక్ ఉంది. టి సిరీస్ నిర్మాణంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా ఎప్పుడో అఫీషియల్ అయ్యింది. కానీ ప్రభాస్ స్పిరిట్ పూర్తి చేసి రిలీజయ్యాకే యానిమల్ డైరెక్టర్ కు మోక్షం దక్కుతుంది. దీనికి ఎంత టైం పడుతుందో చెప్పడం కష్టం. కనిష్టంగా రెండేళ్లకు పైమాటే.

రెండు రోజుల నుంచి కోలీవుడ్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపిస్తోంది. నిజానికతను జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. కానీ రజనీకాంత్ కు ఇంకా కథ చెప్పలేదు. ఆయనకు నచ్చి ఓకే చెబితేనే సెట్స్ కు వెళ్తుంది. లేదంటే ఆలస్యమవుతుంది. కూలి అయ్యేదాకా తలైవర్ బిజీగా ఉంటాడు. సో నెల్సన్ బన్నీ కాంబోని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. అట్లీతో అనుకున్నది కార్యరూపం దాల్చలేదు. స్టోరీ దగ్గర ఏకాభిప్రాయం రాలేదనే టాక్ ఉంది. పుష్ప 3 మీద సుకుమార్ ఆసక్తి చూపిస్తున్నాడు కానీ వరసగా మూడు భాగాలంటే రిస్క్ అవుతుందని బన్నీ సైతం వ్యక్తిగతంగా ఫీలవ్వొచ్చు.

ఇదంతా ఒకరకమైన అయోమయానికి దారి తీస్తోంది. దర్శకులను లాక్ చేసుకున్నట్టే కనిపిస్తోంది కానీ దేనికీ సరైన క్లారిటీ ఉండటం లేదు. ఒకవేళ పుష్ప 3 అనుకున్నా సుకుమార్ ఆల్రెడీ రామ్ చరణ్ కు కమిట్ మెంట్ ఇచ్చాడు. దాని పనులు మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ తన ముందున్న ఆప్షన్లను సీరియస్ గా విశ్లేషణ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా వీలైనంత ఏదో ఒకటి డిసైడ్ అవ్వకపోతే ఇలాంటి ప్రచారాలు వస్తూనే ఉంటాయి. రెండు మూడేళ్ళకు ఒక్క సినిమా చేయడం పట్ల అభిమానుల్లో రేగుతున్న అసంతృప్తిని గుర్తించడం ఎంతైనా అవసరం.

This post was last modified on July 17, 2024 9:54 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

6 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

7 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

7 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

7 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

9 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

10 hours ago