అఖిల్ కెరీర్ లోనే ఏజెంట్ అతి పెద్ద డిజాస్టర్ అవ్వొచ్చుగాక. కానీ థియేటర్లలో చూడని వాళ్ళు ఎందరో ఉంటారు. బాలేకపోయినా పర్లేదు ఓసారి టీవీ లేదా మొబైల్ లో చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో లేదా కోట్లలో ఉంటుంది. అయినా సరే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటిదాకా ఓటిటి స్ట్రీమింగ్ కి నోచుకోలేదు. ఇంకోవైపు దీని హిందీ డబ్బింగ్ వెర్షన్ ని గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్ ఈ నెల 28 ప్రసారం చేయబోతున్నట్టు యాడ్స్ తో హోరెత్తిస్తోంది. ఇది చూసిన అఖిల్ అభిమానులు అనువాదం తప్ప ఒరిజినల్ చూస్ ఛాన్స్ లేదాని బాధపడుతున్నారు. కానీ ఇది ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ తెలుగు హక్కులను సోని లివ్ కి ఇచ్చారు. అగ్రిమెంట్ కూడా అయ్యింది. తర్వాత బయట డిస్ట్రిబ్యూటర్ తో ఫైనాన్స్ కి సంబంధించిన ఏదో వివాదం వల్ల బ్రేక్ పడింది. తర్వాత ఆ కేసు ముందుకు వెళ్లిన దాఖలాలు కూడా కనిపించలేదు. సరే సద్దుమణిగిందేమో అనుకుంటే ఎదురు చూసే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది కానీ ఏజెంట్ బుల్లితెర దర్శనం జరగలేదు. పోనీ శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినా చూద్దామంటే ఆ అదృష్టమూ లేదు. ఇటీవలే సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు తెలుగు ఏజెంట్ అతి త్వరలో ఓటిటిలో రావొచ్చనే వార్త ఇప్పటికైతే నిజం కాదు.
ఆర్ఆర్ఆర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ నుంచి చిన్న సినిమాల వరకు మహా అయితే యాభై రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తున్న ట్రెండ్ లో ఏజెంట్ ఏడాదికి పైగానే వెయిటింగ్ లో ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పటికైనా సోని లివ్ సమస్య ఏదైనా ఉంటే త్వరగా పరిష్కరించుకుని తమ హీరోని హెచ్డిలో చూపించమని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి వాళ్ళు వింటారో లేదో కానీ మొత్తానికి ఒక స్టార్ హీరో మూవీ ఇన్ని నెలల తర్వాత కూడా డిజిటల్ లో రాకపోవడం విచిత్రం. హిందీ అనౌన్స్ మెంట్ వచ్చింది కాబట్టి తెలుగు శుభవార్త కూడా వినొచ్చని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. చూద్దాం.
This post was last modified on July 15, 2024 5:58 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…