సౌత్ ఇండియాలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఉన్న లైకా ప్రొడక్షన్స్ బడ్జెట్ పరంగా ఎలాంటి లెక్కలు వేసుకోదనేది ఓపెన్ సీక్రెట్. కాంబో నచ్చి, కథ ఉందని పేరున్న దర్శకుడు వస్తే చాలు మంచినీళ్లలా కోట్లు ఖర్చు పెడతారు నిర్మాత సుభాస్కరన్. అయితే గత కొన్నేళ్లుగా ఈ బ్యానర్ కు నెంబర్ 2 గండం పట్టుకుంది. అంటే సీక్వెల్స్ ఏది చేసినా వర్కౌట్ కావడం లేదు సరికదా మరిన్ని నష్టాలు వచ్చి పడుతున్నాయి. వివరాలు చూస్తే మీకే అర్థమైపోతుంది. రజనీకాంత్ 2.0 సన్ పిక్చర్స్ వద్దనుకున్నప్పుడు దర్శకుడు శంకర్ మీద నమ్మకంతో లైకా కోరిమరీ తీసుకుని విపరీతమైన బడ్జెట్ తో తెరకెక్కించింది.
తీరా చూస్తే రోబో స్థాయిలో 2.0 అద్భుతాలు చేయలేదు. బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూలు చేసినా ఆశించిన స్థాయిలో అన్ని భాషల్లో నెంబర్లు నమోదు కాలేదు. పొన్నియిన్ సెల్వన్ 2 తమిళంలో మాత్రమే భారీగా ఆడింది. తెలుగులో మొదటి భాగంతో పాటు అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ అందుకుంది కానీ డబ్బింగ్ వెర్షన్లలో బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. ఇక చంద్రముఖి 2ది మరో ట్రాజెడీ. దర్శకుడు పి వాసు చెప్పిన కథ ఎలా నమ్మారో కానీ లారెన్స్, కంగనా రౌనత్ ఉన్నారు కాబట్టి జనం ఎగబడి చూస్తారనుకునే లెక్క అడ్డంగా తప్పింది. ఫలితంగా అందరి కెరీర్లలోనే పెద్ద డిజాస్టర్ మూటగట్టుకుంది.
తాజాగా ఇండియన్ 2 ఇదే బాట పడుతోంది. ఏదో వీకెండ్ పుణ్యమాని కలెక్షన్లు ఓకే కానీ టాక్, రివ్యూలు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం రాబోయే రోజుల్లో పెద్ద ముప్పే తెచ్చిపెడుతోంది. లైకా లిస్టులో సీక్వెల్స్ ప్రవాహం ఆగలేదు. మోహన్ లాల్ లూసిఫర్ 2 (టైటిల్ ఎంపురన్) షూట్ జరుగుతోంది. అరుణ్ విజయ్ మాఫియా 2, మిషన్ 2 స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బాహుబలి, కెజిఎఫ్ లాగా క్రేజీ సీక్వెల్ పడకపోవడం లైకా మేకర్స్ ని ఇబ్బంది పెడుతోంది. మరి దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి. ఇవే అనుకుంటే ఇండియన్ 3 మీద బజ్ రాకపోయే ప్రమాదం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on July 14, 2024 5:06 pm
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…