నేరం ఎవరు చేసినా అది నేరమే. ఇష్టమైన వ్యక్తి చేశాడు కాబట్టి దాన్ని సమర్ధించుకోవడానికి లేదు. స్వంత అభిమాని హత్య కేసులో బెంగళూరు పరప్పన కారాగారంలో ఉన్న హీరో దర్శన్ ఇంకా విచారణను ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. తనకు జైలు ఫుడ్డు పడటం లేదని, ప్రత్యేకంగా ఇంటి నుంచి నాన్ వెజ్ ఆహారం తెప్పించాలని న్యాయస్థానానికి విన్నవించుకోవడం గురించి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్రియురాలు పవిత్ర గౌడతో కలిసి చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామిని కిరాతకంగా పొట్టనబెట్టుకున్న కేసులో దర్శన్ చుట్టూ పక్కా సాక్షాధారాలతో బలమైన ఉచ్చు బిగుస్తోంది.
కళ్ళముందు నిజాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా దర్శన్ ఫ్యాన్స్ మాత్రం అతనో స్వాతిముత్యం రేంజ్ లో హడావిడి చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఇటీవలే ఇతని పాత సినిమా శాస్త్రి (2005) రీ రిలీజ్ అయ్యింది. అభిమానులు థియేటర్ దగ్గరకు వెళ్లి దర్శన్ కి ఇచ్చిన ఖైదీ నెంబర్ 6106ని పెద్ద అక్షరాలతో బ్యానర్ చేయించి అప్పటికి అదే హాలులో ఆడుతున్న కల్కి 2898 ఏడి పోస్టర్ మీదుగా వేలాడదీసి తమ ఫ్యానిజంని ప్రదర్శించారు. అసలు ఖైదీకిచ్చే సంఖ్యని ఏదో పద్మశ్రీ వచ్చిన రేంజులో ఇంతగా బిల్డప్ ఇచ్చి ప్రమోట్ చేయడమనేది ఎంత విచిత్రమైన సంస్కృతో అర్థం కావడం లేదు.
హీరోల మీద అభిమానం ఉండటంలో తప్పులేదు. కానీ అది హద్దుల్లో, సామజిక ఆమోదంలో ఉండాలి. అంతే తప్ప మర్డర్ చేసినా సరే మావోడే రైట్ అంటే ఎవరైనా చేయగలిగింది ఏమి లేదు. ఈ ధోరణి పట్ల కన్నడ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినిమా పిచ్చిలో కుర్రాళ్ళు ఇలా వెర్రి తలలు వేయడం చూస్తుంటే హత్యనేది అసలు తప్పే కాదనే రీతిలో ప్రొజెక్ట్ అవుతుందని, ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఎంత ముదిరిపోయిందంటే కొందరు ఏకంగా ఆ నెంబర్ తో టి షర్టులు చేయించుకుని అదో ఘనకార్యంగా వీధుల్లో తిరుగుతున్నారు.
This post was last modified on July 12, 2024 8:54 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…