మంజుమ్మల్ బాయ్స్ రాకపోయి ఉంటే ఎప్పుడో 1991లో వచ్చిన గుణ గురించి ఇప్పటి ప్రేక్షకులు పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా ప్రియతమా నీవచట కుశలమా పాటకొచ్చిన ప్రాముఖ్యం మరింత పెరిగింది. దీన్ని అవకాశంగా వాడుకోవాలని గుణ తమిళ వెర్షన్ ని గత జూన్ 21న రీ రిలీజ్ చేశారు. పిరమిడ్, ఎవర్ గ్రీన్ సంస్థలు కలిసి సంయుక్తంగా విడుదల చేశాయి. కమల్ హాసన్ హీరో అందులోనూ కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న మూవీ కావడంతో కలెక్షన్లు బాగానే వస్తాయని భావించారు. నిజానికి దీని ఒరిజినల్ వెర్షన్ యావరేజ్. ఇతర భాషల్లో భారీ డిజాస్టర్. ఇళయరాజా సంగీతం వల్లే పేరు వచ్చింది.
ఇదంతా బాగానే ఉంది కానీ గుణ హక్కులు తన దగ్గర ఉన్నాయని ఘనశ్యామ్ హేమదేవ్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. తనకు చెప్పకుండా రిలీజ్ చేశారని, దీని మీద శాశ్వత నిషేధం విధించి ఇప్పటిదాకా వసూలైన మొత్తాన్ని తనకు చెల్లించేలా ఆదేశించాలని విన్నవించుకున్నాడు. దీంతో ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం సదరు ప్రొడక్షన్ కంపెనీలకు నోటీసులు పంపించింది. ఇండియన్ 2 విడుదలవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని చాలా థియేటర్లలో గుణ ఆల్రెడీ తీసేశారు. ఏదేదో ఊహించుకున్నారు కానీ అంత రెస్పాన్స్ రాలేదట.
ఏదో కొత్త సినిమాల కోర్టు గొడవంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇలా పాత రీ రిలీజుల గురించి కూడా వివాదాలు చెలరేగడం విచిత్రం. టాలీవుడ్ రీ రిలీజుల ట్రెండ్ కొచ్చిన స్పందన చూశాక కోలీవుడ్ లోనూ ఇది ఊపందుకుంది. ముత్తు, గిల్లి, పోకిరి, అలవందాన్, బిల్లా, తుపాకీ లాంటి క్లాసిక్స్ ని గత నాలుగైదు నెలల నుంచి థియేటర్లలో వదులుతూనే ఉన్నారు. ఎంతో కొంత సొమ్ములు బాగానే వస్తుండటంతో క్రమంగా హక్కులకు సంబంధించిన కాంట్రావర్సీలు మొదలయ్యాయి. దెబ్బకు పాత చిత్రాల నెగటివ్ హక్కులకు సంబంధించిన అగ్రిమెంట్లను నిర్మాతను చెక్ చేసుకునే పనిలో పడ్డారట.
This post was last modified on July 11, 2024 5:51 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…