సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఆఫర్ వస్తే ఎవరైనా వద్దనుకుంటారా. వినడానికే ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. అది కూడా రెండుసార్లు జరిగిందంటే ఇంకా షాక్ అనిపిస్తుంది. ముందు వర్తమానం చూసి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళదాం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజని హీరోగా కూలీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలైన సంగతి తెలిసిందే. గెటప్ కూడా లీకైపోయింది. మునుపటి కన్నా యంగ్ గా ఏడు పదుల వయసులోనూ తలైవర్ కనిపించడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇందులో పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ కి ఒక కీలక పాత్ర ఆఫర్ చేశారు.
కానీ తను ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెట్టయాన్ లో చాలా ప్రాముఖ్యం ఉన్న క్యారెక్టర్ ఆల్రెడీ చేశాను కాబట్టి దాని కన్నా తక్కువ స్థాయి అనిపించే పాత్రని కూలిలో చేయలేనని ఫహద్ తనకు విక్రమ్ రూపంలో కమల్ హాసన్ తో స్క్రీన్ పంచుకునే ఛాన్స్ ఇచ్చిన లోకేష్ తో అన్నాడట. సో ఒక ఇంటరెస్టింగ్ కాంబో మిస్ అయినట్టే. ఇక కొంచెం వెనక్కు వెళ్తే వెట్టయాన్ క్యాస్టింగ్ జరుగుతున్న సమయంలో న్యాచురల్ స్టార్ నానిని తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ ప్రాధాన్యం అనిపించకపోవడంతో నాని సున్నితంగా నో చెప్పాడు. అది కాస్తా దగ్గుబాటి రానాకు చేరి అతను నటించేశాడు.
సో ముందు నాని తర్వాత ఫహద్ ఫాసిల్ ఇద్దరూ రెండు వేర్వేరు రజనీకాంత్ సినిమాలకు నో చెప్పిన వైనం బయటపడింది. ఇవి అధికారికంగా ప్రొడక్షన్ హౌస్ నుంచి వాచ్చిన వార్తలు కాకపోయినా అంతర్గతంగా బలమైన సోర్స్ నుంచి వచ్చినవే. దీపావళి విడుదలకు వెట్టయాన్ సిద్ధమవుతోంది. కూలిని వచ్చే వేసవికి రెడీ చేస్తున్నారు. షూటింగుల విషయంలో యమా స్పీడ్ పాటిస్తున్న రజనీకాంత్ తో కలిసి తెరను పంచుకునే అదృష్టం ఎన్నిసార్లు వచ్చినా ఎవరూ వద్దనుకోరు. అలాంటిది నాని, ఫహద్ ఇద్దరూ తప్పుకున్నారంటే కంటెంట్ లో తమ పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates