రేపు విడుదల కాబోతున్న భారతీయుడు 2 మీద విపరీతమైన అంచనాలు లేకపోయినా నిర్మాతలు తెలంగాణలో టికెట్ హైక్ కోసం అనుమతులు తెచ్చుకోవడం ప్రేక్షకుల కన్నా ముందు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒరిజినల్ వెర్షన్ రిలీజవుతున్న తమిళనాడులో మాములు ధరలే ఉండగా ఇక్కడ మాత్రం స్పెషల్ రేట్లు పెట్టడం విస్మయం కలిగించేదే. బహుశా భారతీయుడు 1 లాగా టాలీవుడ్ లోనే బాగా ఆడుతుందనే నమ్మకం కాబోలు. అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా లేవు కానీ ఉదయం త్వరగా మొదలయ్యే ప్రీమియర్ షోల నుంచి వచ్చే టాక్ ఓపెనింగ్స్ పరంగా కీలకం కానుంది.
ఇక్కడ భారతీయుడు 2 ముందు పలు సవాళ్లున్నాయి. విక్రమ్ సక్సెస్ కేవలం ఆ ఒక్క సినిమాకే పరిమితం కాకూడదని కమల్ హాసన్ భావిస్తున్నారు. అందుకే ఎంత శ్రమ అవుతున్నా ఆయనే స్వయంగా అన్ని రాష్ట్రాలు తిరిగి స్వయంగా ప్రమోషన్లు చేసుకున్నారు. ప్రధాన నగరాలూ అన్నీ కవర్ చేశారు. తెలుగులో సక్సెస్ లేక ఏళ్ళు గడిచిపోయినా సిద్దార్థ్ ఇందులో చేసింది చిన్న క్యారెక్టర్ కాదు. సో ఇది హిట్ అయితే తనకొచ్చే క్రెడిట్ పెద్దదే. రకుల్ ప్రీత్ సింగ్ సైతం దీని కోసమే ఎదురు చూస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం ఆశించిన మేజిక్ పాటల పరంగా చేయలేదు. సో భారమంతా బిజిఎం మీదే.
ఇక దర్శకుడు శంకర్ తన కంబ్యాక్ ని దీంతోనే ఋజువు చేసుకోవాల్సి ఉంటుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మీద భారతీయుడు 2 రిజల్ట్ ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. ఇది బాగుంటేనే ఆయన మీద నమ్మకం మరింత బలపడుతుంది. ఇలా రకరకాల క్యాలికులేషన్లు సేనాపతి ముందున్నాయి. వాటిని దాటుకోవడం బజ్ తక్కువగా ఉన్న ఇలాంటి పరిస్థితిలో అంత సులభం కాదు. పైగా భారతీయుడు 3 గురించి పదే పదే హైలైట్ చేయడం కొంత ప్లస్ కొంత మైనస్ గా మారింది. కల్కి 2898 ఏడి తర్వాత బాక్సాఫీస్ జోష్ ని కమల్ హాసన్ ఏ మేరకు కొనసాగిస్తారో ఇంకొద్ది గంటల్లో తేలనుంది.
This post was last modified on July 11, 2024 10:50 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…