తొమ్మిది వందల కోట్ల వసూళ్లతో థౌజండ్ మైలురాయి వైపు పరుగులు పెడుతున్న కల్కి 2898 ఏడి విజయాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్న వాళ్లలో ముందుగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరే చెప్పాలి. దీపికా పదుకునే, కమల్ హాసన్ లకు మంచి పాత్రలే దక్కినప్పటికీ బాలీవుడ్ దిగ్గజానికి దొరికిన స్క్రీన్ స్పేస్, ఎలివేషన్లు వీళ్లకు లేవంటే అది అబద్దం కాదు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ప్రభాస్ నే డామినేట్ చేసే స్థాయిలో అమితాబ్ చెలరేగిపోయారు. ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో రిలీజ్ రోజు నుంచి వరసగా పెడుతున్న ట్వీట్లను చూసి చెప్పొచ్చు. కల్కిని అంత విపరీతంగా ప్రేమించారన్న మాట.
కల్కి విశేషాలను మరింత లోతుగా అందించే క్రమంలో వైజయంతి టీమ్ ఒక వీడియో సిరీస్ ని చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తోంది. అందులో భాగంగా దర్శకుడు నాగ్ అశ్విన్ అమితాబ్ బచ్చన్ తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది. త్వరలోనే ఫుల్ వెర్షన్ వదలబోతున్నారు. అందులో ఆయన మాట్లాడుతూ ఒకసారి హైదరాబాద్ వచ్చి స్థానిక ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో కల్కి 2898 ఏడి చూడాలని ఉందని, సినిమాలను ఇంత పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్ళతో కలిసి చూడాలని తన ఆకాంక్ష వ్యక్తపరిచారు. దీన్ని బట్టి ఆయన లైవ్ లో ఫ్యాన్ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని అర్థమవుతోందిగా.
నిజానికి దేశంలో ఎక్కడ లేని సినిమా ప్రేమ సౌత్ లోనే కనిపిస్తుంది. బాలీవుడ్ లో ఈ హంగామా ఒకటి రెండు రోజులకు పరిమితమైతే మన దగ్గర పాత రీ రిలీజులను సైతం ఉదయం 8 గంటలకే హౌస్ ఫుల్స్ చేసి అల్లరి చేస్తారు. ఆ సెలబ్రేషన్స్ వీడియోల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమితాబ్ బచ్చన్ ఇవన్నీ గమనించే ఉంటారు. నిజంగా ఆయన రావాలే కానీ మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. పనిలో పని ప్రభాస్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్ లతో కలిసి వస్తే రచ్చ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడం కష్టం.
This post was last modified on July 9, 2024 6:53 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…