కథ సుఖాంతం అని చెప్పడానికి పెద్దలు కథ కంచికి మనమింటికి అని చెప్పేవాళ్ళు. కానీ ఓటిటి కహానీలు అలా లేవు. కరోనా సమయంలో థియేటర్లు మూతబడిన వేళ డైరెక్ట్ డిజిటల్ రిలీజుల కోసం సదరు సంస్థలు వందల కోట్లను మంచి నీళ్లలా ఖర్చు పెట్టాయి. కేవలం కాంబోల ఆధారంగా గుడ్డిగా హక్కులు కొన్న దాఖలాలు అన్ని భాషల్లో కలిపి పదులు కాదు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఆడియన్స్ ని మెప్పించినవి ఎన్నినేది పక్కనపెడితే రిలీజ్ కు ముందే కళ్లుచెదిరే సొమ్ములు చూడటం మొదలుపెట్టిన నిర్మాతలు ఇది శాశ్వతంగా పెరిగే ట్రెండ్ అనుకున్నారు. కానీ మూడేళ్ళ గ్యాప్ లో జరిగిన మార్పులెన్నో. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
స్టార్ హీరో నటించిన పెద్ద ఇండియా మూవీ. అగ్రిమెంట్ సమయంలోనే ఫలానా తేదీకి థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది కాబట్టి దానికి నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటిటి స్ట్రీమింగ్ ఉండేలా రాసుకున్నారు. కానీ సవాలక్ష కారణాలతో నిర్మాణం ఆలస్యమైపోయి ఒకవేళ విడుదల తేదీని మిస్ చేసుకుంటే మాత్రం ఒప్పందం ప్రకారం ముందు చెప్పిన ధరలో భారీ కోత పడుతుంది. అప్పటికే వడ్డీల భారం, పారితోషికాల గుదిబండను మోస్తున్న ప్రొడ్యూసర్ కి ఈ కోత తీరని శరాఘాతం. మరో మీడియం బడ్జెట్ సినిమా. పదిహేను కోట్లలో అయిపోయింది. ఓటిటికి కనీసం ఏడెనిమిది కోట్లు వస్తాయని సదరు బ్యానర్ ఆశించింది.
కానీ హీరో మార్కెట్ డౌన్ కావడంతో పాటు ప్రాజెక్టు మీద బజ్ లేకపోవడం వల్ల సగమే ఇస్తామని ఓటిటి కంపెనీ కబురు పెడితే గుండెపోటు రావడం ఒకటే తక్కువ. ఇంకో చిన్న సినిమాని పెద్ద ఓటిటిలు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో నిర్మాత చిన్నవాటి చుట్టూ తిరిగాడు. ప్రొడక్షన్ కాస్ట్ నాలుగు కోట్లయితే వాళ్ళు ఇస్తామన్న మొత్తం కేవలం యాభై లక్షలు. అది కూడా థియేటర్లలో రిలీజై మంచి రివ్యూలు వస్తేనే అనే కండీషన్ మీద. సరే ఇంత చేసినా కలెక్షన్లు రాలేదు, బ్రేక్ ఈవెన్ కాలేదనే అర్థం లేని సాకులు చూపించి రేటుని సగానికి సగం తగ్గించేసే బాపతు ఓటిటి కేసులు బోలెడున్నాయి.
వీటికి పరిష్కారం లేదా అంటే ఉంది. క్రేజీ కాంబోలను నమ్ముకుని, కంటెంట్ ని గాలికి వదిలేసి, కేవలం రైట్స్ తో గట్టెక్కుద్దాం అనుకునే వాళ్లకు ఇదో అంతు లేని కథగా మిగిలిపోతుంది. వందల కోట్ల మార్కెట్, ఓవర్సీస్ లో బలమైన పట్టు ఉన్న స్టార్లకు ఇబ్బంది లేదు. వాళ్ళ సినిమాలు ఎలాగైనా అమ్ముడుపోతాయి. కానీ సక్సెస్ ఫెయిల్యూర్స్ మధ్య ఊగిసలాడే మిడిల్ క్లాస్ హీరోలకు ఈ వెసులుబాటు ఉండదు. చిన్న చిత్రాల పరిస్థితి మరీ ఘోరం. నాణ్యత లేని సినిమాలు ఎప్పటికీ కంచికి చేరలేక ల్యాబుల్లో, దర్శక నిర్మాతల హార్డ్ డిస్కుల్లో మగ్గుతూనే ఉంటాయి. మోక్షం కావాలంటే బెస్ట్ ఇవ్వాల్సిందే. లేదంటే ఇది రిపీటవుతూనే ఉంటుంది.
This post was last modified on July 9, 2024 6:42 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…