టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్‌కు కెరీర్ ఆరంభంలో వరుసగా హిట్లు పడ్డాయి. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో అతను యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అతడికి తిరుగులేదు అనుకుంటే.. తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. హడావుడిగా సినిమాలు ఒప్పుకుని, క్వాలిటీ చూసుకోకపోవడంతో కెరీర్ తిరోగమనంలో పయనించింది.
సోలో హీరోగా అతను హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. వెంకటేశ్వర క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలో చేసిన సినిమాలు కూడా ఆడలేదు. ఇప్పుడు అతను హీరోగా ‘తిరగబడరా సామి’ అనే సినిమా రాబోతోంది. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ సినిమాలు తీసిన రవికుమార్ చౌదరి రూపొందించిన చిత్రమిది.
ఐతే హీరోతో పాటు దర్శకుడూ ఫాంలో లేకపోవడంతో ఈ చిత్రానికి బజ్ లేదు. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా అంతంతమాత్రంగా కనిపించింది. రాజ్ తనకు నప్పని మాస్ చొక్కా తొడుక్కున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. దీంతో సినిమాకు బజ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలో రాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం మీడియాలో చర్చనీయాంశం అయింది. రాజ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టింది. ఆమె మీద రాజ్ కూడా పలు ఆరోపణలు చేశాడు. మరోవైపు ‘తిరగబడరా సామి’ హీరోయిన్ మాల్విని సైతం ఈ వివాదంలోకి లాగింది లావణ్య. ఆమెతో రాజ్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఆరోపించింది. మాల్వి ఈ ఆరోపణలకు దీటుగా బదులిస్తూ.. లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ‘తిరగబడరా సామి’ సినిమాకు కూడా కొంత పబ్లిసిటీ వస్తోంది.
ఐతే బాలీవుడ్లో సినిమాల రిలీజ్‌కు ముందు పబ్లిసిటీ కోసమే ఇలాంటి వివాదాలు రాజేసే ట్రెండ్ ఉంది. రాజ్-లావణ్య-మాల్వి గొడవ అలా క్రియేట్ చేసింది కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ల వ్యక్తిగత జీవితాల మీద ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. కానీ ఈ వివాదం వల్ల బజ్ లేని సినిమాకు పబ్లిసిటీ వచ్చి జనాల నోళ్లలో ఆ సినిమా పేరు నానుతోందన్నది మాత్రం వాస్తవం. మరి సినిమాకు ఇది ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.
This post was last modified on July 8, 2024 3:18 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…