ఏజెంట్ చేసిన డిజాస్టర్ గాయమేమో కానీ అఖిల్ కొత్త సినిమా మొదలుపెట్టక ఏడాది గడిచిపోవడంతో అభిమానులు అసహనంగా ఉన్న మాట వాస్తవం. ఎవరికీ ఫ్లాప్ రానట్టు దానికి ఇంత బాధ పడి గ్యాప్ తీసుకోవాలా అనే ప్రశ్నలో న్యాయముంది కానీ నిజానికి అఖిల్ ఇదంతా కావాలని చేసింది కాదు. యువి క్రియేషన్స్ నిర్మించబోయే భారీ ప్యాన్ ఇండియా మూవీ మేకోవర్ కోసం ఇంత సమయం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అనిల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ గ్రాండియర్ ని త్వరలోనే లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అఖిల్ ప్లానింగ్ కేవలం ఒక్క మూవీతో ఆగడం లేదు.
మరో రెండు సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వాటిలో మొదటిది స్వంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఫిక్స్ చేయబోయేది. వినరో భాగ్యము విష్ణుకథతో ప్రేక్షకులను మెప్పించిన ఈ డైరెక్టర్ చెప్పిన చిత్తూరు బ్యాక్ డ్రాప్ కథ నచ్చడంతో నాగ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. నాగ చైతన్యకు ఏ మాయ చేశావే రూపంలో మంచి బ్రేక్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ మీనన్ తోనూ ఒక మూవీ చేయాలనీ అఖిల్ ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన దగ్గర కథ సిద్ధంగా ఉందని సమాచారం. కాకపోతే కొంచెం టైం పడుతుంది.
ఇప్పుడొచ్చిన గ్యాప్ పూర్తిగా తీరిపోయేలా అఖిల్ రాబోయే మూడేళ్ళకు సరిపడా బిజీగా ఉండేలా ప్రణాళిక రచిస్తున్నట్టు కనిపిస్తోంది. పరిశ్రమకు వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ తన ఖాతాలో బ్లాక్ బస్టర్ లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఒకటే డీసెంట్ సక్సెస్ అందుకోగా మిగిలినవన్నీ ఫ్లాపే. నాగ్ ని మించి మాస్ హీరో అవుతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో అఖిల్ కెరీర్ ఇలా నెమ్మదించడం కొంత ఆందోళన కలిగించేదే అయినా ఇక నుంచి ఇదే ఫ్లోని కొనసాగిస్తే ఎక్కడో చోట పెద్ద బ్రేక్ దొరుకుతుంది. మోహన్ రాజాతోనూ ఒక సినిమా అనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.
This post was last modified on July 8, 2024 3:07 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…