ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు ప్రభాస్. ఐతే ఒకప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి తెగ చర్చ జరిగేది. కానీ ఈ మధ్య దాని గురించి మాట్లాడుకోవడం మానేశారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఉండగా.. అతడి పెళ్లి గురించి చాలా తపన పడ్డారు.
‘బాహుబలి’ రెండో భాగం పూర్తయ్యాక ప్రభాస్ పెళ్లి చేసేస్తామని ఘంటాపథంగా చెప్పారు. కానీ ఆ సినిమా విడుదలై ఏడేళ్లు గడిచిపోయాయి. గత ఏడాది కృష్ణంరాజు కాలం చేశారు కూడా. కానీ ప్రభాస్ ఇంకా పెళ్లి కొడుకు కాలేదు.
ప్రభాస్‌కు త్వరలోనే 45 ఏళ్లు నిండబోతుండడంతో ఇక అతను పెళ్లి చేసుకోడనే అంచనాకు వచ్చేశారు అభిమానులు. కానీ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి మాత్రం తన కొడుకు పెళ్లి జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పైనుంచి కృష్ణంరాజు అంతా చూసుకుంటారని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ఘనవిజయం సాధించడంపై శ్యామలాదేవి స్పందిస్తూ.. ‘‘బాహుబలి తర్వాత ప్రభాస్‌కు విజయాలు దక్కవని కొందరన్నారు. కానీ వారి అంచనాలు తారుమారు అయ్యాయి. మంచితనం ఒక మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఇది రుజువు.
కోట్లాదిమంది అభిమానులు ఆశించినట్లుగా తన సినిమాలు ఉండాలని ప్రభాస్ కష్టపడుతున్నాడు. బాధ్యత తీసుకుని దృష్టి మరలకుండా ఈ పని చేస్తున్న అతను గొప్ప వ్యక్తి. ప్రభాస్ పెళ్లి చేయాలని మాకూ ఉంది. దేనికైనా సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. పై నుంచి కృష్ణంరాజు గారు అన్నీ చూసుకుంటారు. ఇప్పటివరకూ ప్రభాస్ విషయంలో ఆయన ఆశించినవన్నీ జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుంది’’ అని శ్యామలాదేవి అన్నారు.
ప్రభాస్ మహర్దశ బాహుబలితోనే ముగిసిందని, ఇక అతను సక్సెస్ చూడలేడని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్యామలాదేవి.. ఇప్పుడు ఆయనకు పరోక్షంగా మరో పంచ్ వేశారు.
This post was last modified on July 7, 2024 9:06 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…