బలగంతో తిరిగి ట్రాక్ లో పడ్డ ప్రియదర్శి సోలో హీరోగా చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా డార్లింగ్. ఉపశీర్షికగా వై థిస్ కోలవెరి అని పెట్టారు. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై నిర్మాత నిరంజన్ రెడ్డి అందిస్తున్న మూవీ ఇదే. డబుల్ ఇస్మార్ట్ తర్వాత రెండు మూడు సినిమాలు చేసి ఆరోగ్య కారణాల వల్ల కొంత బ్రేక్ తీసుకున్న నభ నటేష్ హీరోయిన్ గా కంబ్యాక్ అవుతోంది కూడా దీన్నుంచే. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ని జూలై 19 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ ఏఏఏ మల్టీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు.
చిన్నప్పటి నుంచి ఆ కుర్రాడి(ప్రియదర్శి)కి పారిస్ వెళ్లాలని కోరిక. అయితే భార్యతో కలిసే విమానం ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకే పాస్ పోర్ట్ కూడా తీసుకోడు. ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో ఆనంది(నభ నటేష్) ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అంతా బాగుందని అనుకుంటున్న టైంలో పెళ్ళానికి స్ప్లిట్ పర్సనాలిటి జబ్బుందని తెలుస్తుంది. అంటే అపరిచితురాలిగా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఆమెకే తెలియదన్న మాట. డాక్టర్ ఫ్రెండ్ (అనన్య నాగళ్ళ) సలహాలు పని చేయవు. రోజులు నరకంగా మారిపోతాయి. మరి వాటి నుంచి ఎలా బయట పడ్డాడనేది తెరమీద చూడాలి.
విక్రమ్ అపరిచితుడు కాన్సెప్ట్ ని తీసుకుని దాన్ని హీరో భార్యకు ముడిపెట్టడమనే వెరైటీ పాయింట్ ని దర్శకుడు అశ్విన్ రామ్ రాసుకున్నాడు. నవ్వించడమే ప్రధాన లక్ష్యంగా కాన్సెప్ట్ సాగుతుందని అర్థమైపోయింది. ప్రియదర్శి కామెడీ టైమింగ్ కి, నభా నటేష్ మాస్ యాక్టింగ్ తోడై ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఇచ్చింది. కథని దాచకుండా ఓపెన్ గా చెప్పడం చూస్తే కంటెంట్ మీద బలమైన నమ్మకమే ఉన్నట్టు కనిపిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం, నరేష్ రామదురై ఛాయాగ్రహణం సమకూరుస్తున్న డార్లింగ్ లో సపోర్టింగ్ తారాగణం పెద్దదే ఉంది. దర్శకుడి ఉద్దేశం ఆడియన్స్ కి కనెక్ట్ అయితే హిట్టు పడ్డట్టే.
This post was last modified on July 7, 2024 11:56 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…