సూర్య హీరోగా సౌత్ ఇండియాలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతున్న కంగువ బిజినెస్ డీల్స్ మొదలైపోయాయి. తమిళంలో దీనికి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ అనూహ్యంగా తెలుగులోనూ డిమాండ్ పెరగడం షాక్ కలిగించే విషయం.
ఒక్క నైజామ్ ఏరియాకే ఇరవై కోట్ల దాకా ధర పలికిందనే వార్త నిన్న ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ తో పాటు యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం వల్ల గ్రాండ్ రిలీజ్ కు అవకాశం దొరుకుతోందని ట్రేడ్ వర్గాల టాక్.
ఇక కంగువకు ఇంత హైప్ రావడానికి కారణాలు లేకపోలేదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద గతం, వర్తమానం రెండు బ్యాక్ డ్రాప్స్ తీసుకుని దర్శకుడు సిరుతై శివ చాలా కొత్త ప్రయోగం చేశాడు. టీజర్ లో చూపించిన విజువల్స్ వందల సంవత్సరాల క్రితం నాటి అటవీ జాతివి కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు.
ఇంకో గెటప్ ని రివీల్ చేయలేదు. యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించడం, దిశా పటాని హీరోయిన్ కావడం, పుష్ప నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.
దేవర వదిలేసిన అక్టోబర్ 10 విడుదల కాబోతున్న కంగువని ఐమాక్స్ తో పాటు 3డి వెర్షన్ ని సిద్ధం చేస్తున్నారు. కోలీవుడ్ నుంచి
ఇప్పటిదాకా ఎవరూ ఇవ్వని థియేటర్ ఎక్స్ పీరియన్స్ కంగువ ఇస్తుందని చెన్నై మీడియా తెగ ఊదరగొడుతోంది. అయితే కల్కి 2898 ఏడిని తలపించేలా గ్రాఫిక్స్, కంటెంట్ ఉంటాయా లేదానేది వేచి చూడాలి.
రెండేళ్లకు పైగా వేరే సినిమా చేయకుండా దీని మీదే ఉన్న సూర్య కంగువ తనకు ప్యాన్ ఇండియా ఇమేజ్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. రజనీకాంత్ కు పెద్దన్న రూపంలో సూపర్ ఫ్లాప్ ఇచ్చిన సిరుతై శివ దీంతోనే తిరిగి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.
This post was last modified on July 7, 2024 11:57 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…