శంకర్-కమల్ హాసన్ జోడీ తమ కలయికలో వచ్చిన కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఇండియన్’కు సీక్వెల్ చేయడం.. అది రెండు భాగాలుగా మారడం.. ముందుగా ఈ నెల 12న ఇండియన్-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం తెలిసిందే. ఇండియన్-3 వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా ఇటీవల కమల్ సింగపూర్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ.. తనకు ఇండియన్-2 కంటే ఇండియన్-3నే ఎక్కువ నచ్చిందని.. అందులోని కథాంశమే తాను ఈ సినిమా చేయడానికి పురిగొల్పిందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇండియన్-2 అంత గొప్పగా ఉండకపోవచ్చని.. కమలే దీని గురించి నెగెటివ్‌గా మాట్లాడాడంటే దీనిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అనే చర్చ జరిగింది. ఐతే ఇది సినిమాకు ప్రతికూలంగా మారడంతో కమల్ స్పందించాడు.
‘ఇండియన్-2’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో కమల్ మాట్లాడుతూ.. “నాకు ఇండియన్-3 బాగా నచ్చిందని చెబితే.. దానర్థం ఇండియన్-2 నచ్చలేదని కాదు. మనం భోజనం చేస్తున్నపుడు చివర్లో డెజర్ట్ తినాలనుకుంటాం కదా. ఇండియన్-3 కోసం నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నా. ఒక పిల్లాడిని అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగితే ఎలా ఉంటుంది? ఇది కూడా అలాంటిదే. నేను ఇండియన్-3 ఉండాలని ప్రత్యేకంగా కోరుకోలేదు. ముందు ఇది ఒకే కథ. కాబట్టి ఇండియన్-3 గురించి నా వ్యాఖ్యల్ని అనుసరించి ఇండియన్-2ను తక్కువ చేయొద్దు” అని కమల్ వివరించాడు.
ఇండియన్-2కు ముందు నుంచే బజ్ తక్కువగా ఉండగా.. ట్రైలర్ కూడా ఏమంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. దీనికి తోడు కమల్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమా మీద అంచనాలు ఇంకా తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. మరి కమల్ తాజా వ్యాఖ్యలతో ప్రేక్షకుల ఆలోచన మారుతుందేమో చూడాలి.
This post was last modified on July 7, 2024 10:31 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…