‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ సాధించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ చూసి వేరే ప్టార్ హీరోలకు కళ్లు కుట్టి ఉంటే ఆశ్చర్యం లేదు. కొందరేమో ఈ క్రేజ్, ఫాలోయింగ్ అంతా తాత్కాలికం అని.. దాన్ని ప్రభాస్ నిలబెట్టుకోలేడని అన్నారు.
ఐతే ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన మూడు చిత్రాలూ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కావడంతో ఈ అంచనానే నిజమవుతుందా అనిపించింది. కానీ దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్ చెక్కు చెదరనిదని మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది.
డిజాస్టర్ టాక్‌తో కూడా ప్రభాస్ ప్రతి సినిమా హిందీలో వంద కోట్ల వసూళ్ల క్లబ్బులో అడుగు పెడుతుండడం విశేషం. ‘సలార్’ హిందీ వెర్షన్‌తో రూ.200 కోట్ల క్లబ్బులోకి కూడా అడుగు పెట్టిన ప్రభాస్.. ఇంకోసారి ఆ మార్కును అందుకోబోతున్నాడు. ప్రభాస్ కొత్త చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సైతం హిందీలో అదరగొడుతోంది.
ఆల్రెడీ ‘కల్కి’ హిందీ వెర్షన్ రూ.175 కోట్ల మార్కును టచ్ చేసింది. రెండో వీకెండ్ మొదలు కాకముందే సాధించిన వసూళ్లు ఇవి. ఈ వీకెండ్లో ‘కల్కి’కి హిందీలో పెద్దగా పోటీ లేదు. దీంతో ఈ వారాంతంలోనూ బాక్సాఫీస్ లీడర్ ఆ చిత్రమే.
దీంతో అలవోకగా రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగు పెట్టబోతోంది. ఐతే ‘బాహుబలి’ తర్వాత రిలీజైన సినిమా కాబట్టి ‘సాహో’కు క్రేజ్ ఉండొచ్చు. ‘సలార్’ పక్కా మాస్ సినిమా కాబట్టి దానికీ వసూళ్ల మోత మోగి ఉండొచ్చు.
కానీ ‘కల్కి’ లాంటి క్లాస్ టచ్ ఉన్న, ప్రయోగాత్మక చిత్రానికి హిందీలో ఇలాంటి వసూళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఎప్పట్లాగే రూరల్ సెంటర్లలో ప్రభాస్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇది కేవలం ప్రభాస్ మేనియా వల్ల సాధ్యమవుతున్న వసూళ్లు అనడంలో సందేహం లేదు. హిందీ ప్రేక్షకులకు ప్రభాస్ మీద ఇంత అభిమానం ఏంటి అని ట్రేడ్ పండిట్లు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి.
This post was last modified on July 6, 2024 4:48 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…