‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లి ఓ కొత్త అనుభూతిని ఇచ్చిందనడంలో సందేహం లేదు. కాకపోతే ఈ సినిమా ఆడియన్స్‌కు పూర్తి సంతృప్తిని మాత్రం ఇవ్వలేకపోయింది. నాగ్ అశ్విన్ ఎంతో కసరత్తు చేసి ఈ కథను రాసుకున్నప్పటికీ.. దాన్ని ఆసక్తికరంగా, అర్థమయ్యేలా తెర మీద ప్రెజెంట్ చేయలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతే కాక కథలోని ఎమోషన్‌ను రాజమౌళి తరహాలో ప్రేక్షకుల మనసుల్లోకి ఎక్కించలేకపోయాడని.. హీరో, విలన్ పాత్రలను సరిగా తీర్చిదిద్దలేదనే విమర్శలు కూడా వచ్చాయి.
అలాగే కాశీ జనాల బాధల్ని సరిగా చూపించలేదని.. శంబాలాలో ఉండే రెబల్స్ లక్ష్యమేంటి అన్నది బలంగా చెప్పలేదని.. ప్రభాస్ పాత్ర తక్కువ ఉందని కూడా ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఐతే నిన్నటి ప్రెస్ మీట్లో విలేకరులు దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు ఈ విమర్శలు, అభిప్రాయాలన్నింటనీ ఉంచారు.
కాశీ జనాల బాధలను బలంగా చూపించకపోవడంపై నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. అలా చూపిస్తే డార్క్ మూవీ అవుతుందనే ఉద్దేశంతో ప్రభాస్ పాత్రను జోవియల్‌గా చూపించాయమని, ఇది తాము తీసుకున్న ఛాయిస్ అని తెలిపాడు. ఇక మిగతా ప్రశ్నలు, అభ్యంతరాలన్నింటికీ నాగ్ అశ్విన్ చెప్పిన సమాధానం ఒక్కటే.. పార్ట్-2 చూడండి అని. పార్ట్-1లో కల్కి ప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేశామని.. పాత్రలను కొద్దిగా పరిచయం చేశామని.. వాటి పూర్తి రూపం ఇంకా బయటపడలేదని నాగ్ అశ్విన్ చెప్పాడు. ప్రభాస్ పాత్రతో పాటు కమల్ క్యారెక్టర్ కూడా రెండో భాగంలో వేరే లెవెల్లో ఉంటాయనే సంకేతాలు ఇచ్చాడతను. తొలి భాగంలో తలెత్తిన ప్రశ్నలన్నింటికీ రెండో భాగంలో సమాధానాలు ఉంటాయని చెప్పాడు. నిజంగా రెండో భాగంలో నాగి చెబుతున్నంత విషయం ఉండొచ్చు. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు కూడా ఉండొచ్చు.
ఒకవేళ ఇప్పటికే తీర్చిదిద్దుకున్న స్క్రిప్టులో అంత బలం లేకపోయినా, అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వకపోయినా.. పార్ట్-1 రిలీజ్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ చూసి కచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయని ఆశించవచ్చు. నాగి ఇగోయిస్టిక్, యారొగెంట్ డైరెక్టర్ కాదు. చాలా వినమ్రంగా ఉంటాడు. యూనిట్లో కూడా స్థాయి చూడకుండా అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాడని పేరుంది. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు, క్రిటిక్స్ విమర్శలు, అభిప్రాయాలను తీసుకుని.. కచ్చితంగా పార్ట్-2ను మెరుగ్గా తీర్చిదిద్దుతాడనడంలో సందేహం లేదు.
This post was last modified on July 6, 2024 12:56 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…