Movie News

సుప్రీమ్ హీరో మీద అంత బడ్జెట్ సేఫేనా

మావయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో చేశాక సాయి ధరమ్ తేజ్ కు బ్రేక్ వచ్చింది. అంతకు ముందు విరూపాక్ష బ్లాక్ బస్టర్ అయినా వేగంగా సినిమాలు చేసేందుకు తొందరపడలేదు. సితార సంస్థలో సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించిన నెలల తర్వాత దాన్ని పక్కన పెట్టేశారు. కారణాలు బయటికి చెప్పకపోయినా స్క్రిప్ట్ విషయంలో భిన్నాభిప్రాయాలని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా తీయబోయే ప్యాన్ ఇండియా మూవీకి నూటా పాతిక కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం.

ఇంత పెద్ద మొత్తం సుప్రీమ్ హీరో మీద వర్కౌట్ అవుతుందానే సందేహం రావడం సహజం. అయితే నిరంజన్ రెడ్డి లెక్కలు వేరుగా ఉన్నాయి. హనుమాన్ తీస్తున్నప్పుడు తేజ సజ్జ, దర్శకుడు ప్రశాంత్ వర్మల మీద అంత ఖర్చు రిస్క్ అవుతుందని భావించిన వాళ్లే ఎక్కువ. కానీ వాటిని పటాపంచలు చేస్తూ మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ పోటీని తట్టుకుని మరీ హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించడం ఎప్పటికీ మర్చిపోలేనిది. అంటే ప్రేక్షకులు హీరోకన్నా ఎక్కువగా కంటెంట్, అందులో గ్రాండియర్ ని ఇష్టపడుతున్నారని అర్థమైపోయింది. కనెక్ట్ అయ్యే రీతిలో చూపిస్తే కనక వర్షం కురిపిస్తారు.

ఈ సూత్రాన్ని నమ్ముకునే ఇంత బడ్జెట్ కి సిద్ధపడినట్టు తెలిసింది. హనుమాన్ విజయం తర్వాత ప్రియదర్శి, నభ నటేష్ కాంబోలో డార్లింగ్ తెరకెక్కించిన ప్రైమ్ షో ఇప్పుడు మొదలుపెట్టబోతున్న సాయి తేజ్ మూవీకి సంబరాల ఏటిగట్టు టైటిల్ ని పరిశీలిస్తోంది. రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేస్తోంది. ఈ సినిమా మేకోవర్ కోసమే తేజు గత కొన్ని నెలలుగా బయటికి రావడం కాదు కదా వేరే కొత్త కథలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఫాంటసీ మిక్స్ తో పాటు సస్పెన్స్, థ్రిల్ కలగలిసిన ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేసేలా టార్గెట్ చేసుకుని దానికి అనుగుణంగా షూట్ చేయబోతున్నారు.

This post was last modified on July 6, 2024 11:04 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

2 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

10 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

11 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

14 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

14 hours ago