సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితం థియేటర్లలో విడుదలై మూడు నెలలు దాటేసింది. అప్పట్లో విమర్శకులు ఆహా ఓహో అని మెచ్చుకున్నారు. మలయాళం వెర్షన్ వసూళ్లు వంద కోట్లు దాటేసి ఔరా అనిపించాయి. తెలుగు డబ్బింగ్ తో పాటు ఇతర అనువాదాలు ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ చూసిన కొద్దిమంది గొప్ప ప్రయత్నమని మెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పటిదాకా ఇది ఓటిటి స్ట్రీమింగ్ జరుపుకోలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ సర్వైవల్ డ్రామాని తొలుత హాట్ స్టార్ కొనుగోలు చేసిందనే ప్రచారం జరిగినా డిజిటల్ మోక్షం దక్కలేదు.
అంతర్గత సమాచారం మేరకు గోట్ లైఫ్ ఆడు జీవితంకి ఇంకా ఓటిటి డీల్ జరగలేదట. నిర్మాతలు అడిగిన ధరకు డిజిటల్ కంపనీ ఇచ్చిన ఆఫర్ కు మధ్య వ్యత్యాసం వల్లే పెండింగ్ లో ఉండిపోయిందని అంటున్నారు. ఈ సినిమా చూడని ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉంది. స్మార్ట్ ప్లాట్ ఫార్మ్ మీద వచ్చినప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళను నిరాశ పరుస్తూ ఎంతకీ రాకపోవడం విచిత్రమే. ఇదే తరహాలో రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషించిన లాల్ సలామ్ సైతం బుల్లితెరపై రాలేదు. పీడకలగా మిగిలే డిజాస్టర్ కావడంతో దాని గురించి ఫ్యాన్స్ డిమాండ్ చేయడం లేదు.
ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. పేరున్న స్టార్లు ఉన్నంత మాత్రాన ఓటిటిలు గుడ్డిగా ఎక్కువ రేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. కంటెంట్ ఏ జానర్ లో ఉంది, ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ గా దాని స్కేల్ ఎంత ఉందని రకరకాల లెక్కలు వేసుకుని మరీ ధరను నిర్ణయిస్తున్నారు. కేవలం స్టార్ పవర్, బ్రాండ్లు పని చేయడం లేదని అర్థమవుతోంది కదా. లేకపోతే గోట్ లైఫ్ ఎప్పుడో రావాల్సింది. అఖిల్ ఏజెంట్ సైతం ఏడాదికి పైగా సోనీ లివ్ దగ్గరే మూలుగుతోంది కానీ బయటికి రావడం లేదు. కోర్టు వివాదమన్నారు కానీ ఆ వ్యవహారం గురించి ఎలాంటి కదలిక లేదు.
This post was last modified on July 3, 2024 5:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…