ఒక సినిమాలో నటించిన ఆర్టిస్టే రిలీజ్ టైంలో ఆ సినిమా గురించి విమర్శ చేయడం అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే సరదాకి చేసిందో.. పొరబాటున జరిగిందో కానీ.. ‘కల్కి 2898 ఏడీ’లో ఓ పాత్ర పోషించిన మలయాళ నటి అనా బెన్.. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి తన ఇన్‌స్టా పోస్టులో నెగెటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది.
మలయాళంలో ‘కుంబలంగి నైట్స్’, ‘కప్పెలా’, ‘హెలెన్’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన నటి.. అనా బెన్. ఈ అమ్మాయి తొలిసారిగా తెలుగులో నటించిన చిత్రం.. ‘కల్కి’నే. స్క్రీన్ టైం తక్కువే అయినా తన పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు అనా బెన్ ఇందులో నటించినట్లే జనాలకు తెలియదు. రెండో ట్రైలర్ వచ్చినపుడే తన పాత్ర రివీలైంది.
రిలీజ్ తర్వాత అనా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా ‘కల్కి’ విడుదల తర్వాత ఈ సినిమాను కొనియాడుతూ ఇన్‌స్టాలో అనా బెన్ ఒక పోస్ట్ పెట్టింది. అందులో చాలా అంశాలను ప్రశంసించినా.. ప్రభాస్ పాత్ర గురించి నెగెటివ్ కామెంట్స్ చేసింది. సినిమాలో ప్రభాస్ చేసింది అన్‌వాంటెడ్ కామెడీ అని.. క్రింజ్ అనిపించిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. అంతే కాక ఒక సాంగ్ సీక్వెన్స్ కూడా సినిమాలో ఫిట్ కాలేదని పేర్కొంది. బహుశా కాంప్లెక్స్‌లో ప్రభాస్-దిశా పఠానిల మీద వచ్చే పాట గురించే ఆమె ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు.
ఐతే ఒక భారీ చిత్రంలో భాగమైన నటి.. ఆ సినిమా రిలీజ్ టైంలో ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. సినిమా చూసినపుడు ఇలాంటి అభిప్రాయాలు కలిగినా.. వాటిని మనసులో దాచుకోవాలి కానీ.. మరీ ఇలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం ఏంటి అంటూ ఆమెను ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
This post was last modified on July 3, 2024 3:39 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…