‘కల్కి 2898 ఏడీ’ సినిమా సామాన్య ప్రేక్షకులనే కాదు.. సెలబ్రెటీలను కూడా ఎంతగానో మెప్పించింది. దీన్ని ఇండియన్ ప్రైడ్‌గా అభివర్ణిస్తూ ఆ చిత్రం మీద ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐతే మన ఇండస్ట్రీ వాళ్లు మన సినిమాను పొగిడితే అందులో ప్రత్యేకత ఏమీ కనిపించదు. వేరే పరిశ్రమ నుంచి దిగ్గజాలు మన సినిమాను కొనియాడితే ఆ కిక్కు వేరుగా ఉంటుంది. అందులోనూ కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్.. ‘కల్కి’ని ప్రశంసిస్తే అది కచ్చితంగా ప్రత్యేకమే.
తన కొత్త చిత్రం ‘ఇండియన్-2’ ప్రమోషన్లలో భాగంగా ఆయన ‘కల్కి’ గురించి మాట్లాడారు. “నేను ఇటీవలే ‘కల్కి’ సినిమా చూశాను. అది భారతీయ సినిమాకు నిజమైన గర్వకారణం. నేను మూడు నెలల కిందటే ఈ సినిమా ఫలితాన్ని అంచనా వేశాను. కల్కి కచ్చితంగా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని చెప్పాను. నేను చెప్పినట్లే ఈ చిత్రం ఇప్పుడు వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా వెళ్తోంది” అని శంకర్ చెప్పాడు.
ఈ ఏడాదే రాబోతున్న పుష్ప-2, కంగువ చిత్రాలు కూడా వెయ్యి కోట్ల మార్కును అందుకుంటాయని.. తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రానున్న ‘కూలీ’ చిత్రం కూడా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందని శంకర్ జోస్యం చెప్పడం విశేషం. ఇక తన కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ గురించి శంకర్ మాట్లాడుతూ.. “ఆ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. దానికి సంబంధించి ఇంకో 10-15 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ‘ఇండియన్-2’ రిలీజ్ కాగానే షూట్ మొదలుపెడతాను. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చుంటాను. పోస్ట్ ప్రొడక్షన్ దశకు వెళ్లాక రిలీజ్ డేట్ మీద ఒక అంచనాకు వస్తాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని శంకర్ తెలిపాడు.
This post was last modified on July 3, 2024 3:26 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…