Movie News

‘కల్కి’లో దీపికకు వాయిస్ ఎవరిచ్చారు?

‘కల్కి’ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో దీపిక పదుకొనేది ఒకటి. ఈ సినిమా కథంతా ఆమె చేసిన సుమతి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ చేసిన భైరవ, అమితాబ్ చేసిన అశ్వథ్థామ పాత్రలను మించి ఈ క్యారెక్టర్ హైలైట్ అయిందని చెప్పొచ్చు. అంత కీలకమైన పాత్రలో దీపిక నటన కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటి అవుతుందనడంలో సందేహం లేదు.

ఫస్ట్ పార్ట్‌లో కథ ముగిసిన తీరును బట్టి చూస్తే.. సెకండ్ పార్ట్‌లో దీపిక పాత్ర ఇంకా కీలకంగా ఉండొచ్చు. ఆమె కడుపులో పెరుగుతున్న వాడే కల్కి అన్నట్లుగా చూపించగా.. ఫస్ట్ పార్ట్‌లో ఆమె ఇంకా బిడ్డకు జన్మనివ్వని సంగతి తెలిసిందే. రెండో భాగంగా ప్రసవం అయ్యాక ఆ బిడ్డ మీద కథ నడిచే అవకాశాలున్నాయి. కాబట్టి దీపిక పాత్ర మరింత ప్రత్యేకతను సంతరించుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. దీపిక పాత్రకు తెలుగు వెర్షన్లో డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ.. చాలా బాగా కుదిరిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్ వరకు దీపిక వాయిసే వినిపించింది. అది కొంచెం ఆడ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ సినిమాలో వేరే వాయిస్ వినిపించింది. ఆ డబ్బింగ్ ఒక ప్రముఖ హీరోయినే చెప్పడం విశేషం. ఆమెనే.. శోభిత ధూలిపాళ్ల. ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ కథానాయికల్లో ఒకరు. కొంచెం మోడర్న్ యాక్సెంట్‌తో ఉండే తన వాయిస్ దీపిక పాత్రకు బాగానే సెట్ అయింది.

తాను ‘కల్కి’లో దీపిక పాత్రకు వాయిస్ ఇచ్చిన విషయాన్ని శోభిత కూడా ధ్రువీకరించింది. ఇదిలా ఉండగా.. సినిమాలో కృష్ణకుమార్ అనే తమిళ నటుడు చేసిన శ్రీకృష్ణుడి పాత్రకు కూడా ఓ ప్రముఖ నటుడే డబ్బింగ్ చెప్పాడు. అతనే.. అర్జున్ దాస్. కోలీవుడ్లో ఈ నటుడికి మంచి పేరుంది. తన వాయిస్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తనతోనే కృష్ణుడి పాత్రకు తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెప్పించారు.

This post was last modified on July 2, 2024 7:31 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

44 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago