బిగ్‍బాస్ షోలో ఎప్పుడయినా కానీ ఒక కంటెస్టెంట్‍ని ఎవరయినా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తే ఇక బయట ప్రేక్షకులు అతడు లేదా ఆమె వెంట నిలబడిపోతారు. హౌస్‍లో వాళ్లకు సపోర్ట్ దక్కకపోతే బయటనుంచి తమ ఓట్లతో వాళ్లను గెలిపించేస్తుంటారు. ఒకే వ్యక్తిని టార్గెట్ చేయడం ఎంత తప్పు అనేది తెలుగు సీజన్ 2లోనే తెలిసి వచ్చి వుండాలి. ‘కౌశల్’ని అప్పటి హౌస్‍మేట్స్ అదే పనిగా టార్గెట్ చేయడం అతడిని విజేతగా నిలబెట్టింది. గత సీజన్లో అదే తప్పు శ్రీముఖి చేసింది. ప్రతి నామినేషన్లోను నిన్ను పెడతానంటూ రాహుల్ సిప్లిగంజ్‍ని టార్గెట్ చేస్తూ మాట్లాడేది. అది కాస్తా శ్రీముఖి విజయావకాశాలను దెబ్బ తీసింది.
అసలు ఎలాంటి గేమ్ ఆడకుండానే రాహుల్‍కి బిగ్‍బాస్ కిరీటం దక్కింది. ఇవన్నీ చూసి కూడా ఈ సీజన్లో బిగ్‍బాస్ హౌస్‍లో వున్న వాళ్లు తమకు తెలియకుండానే కుమార్ సాయిని టార్గెట్ చేస్తున్నారు. మొదట ఆడియన్స్ అది పట్టించుకోకపోయినా కానీ సోమవారం నామినేషన్ ఎపిసోడ్‍తో కుమార్ సాయికి ఒక్కసారిగా సింపతీ పెరిగిపోయింది.
చాలా మంది కలిసి ఒక్కడినే టార్గెట్ చేస్తున్నారంటూ అతడికి సింపతీ ఓట్లు మొదలైపోయాయి. దీనిని ఆదిలోనే కట్ చేయగలిగితే ఓకే కానీ ఈ తరహా ఎపిసోడ్లు మరో రెండు పడ్డాయంటే మాత్రం ఇక అంతే సంగతులు. అసలే మన తెలుగు ప్రేక్షకులు సెంటిమెంట్ కోసం ఏ ఎండ్‍కి అయినా వెళ్లిపోతారు.
This post was last modified on September 22, 2020 10:57 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…