ఇంతింతై అన్నట్టు ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ అంతకంతా పెరుగుతూ పోవడం సినిమా సినిమాకు చూస్తున్నాం. బాహుబలి తర్వాత సాహో మన దగ్గర నిరాశ పరిచినా నార్త్ లో బాగానే ఆడింది. రాధే శ్యామ్ డిజాస్టరనిపించుకున్నా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ఆదిపురుష్ ఏకంగా ట్రోలింగ్ బారిన పడింది. అయినా నాలుగు వందల కోట్లు దాటాయి. సలార్ మిక్స్ టాక్ తోనే సూపర్ హిట్ అనిపించుకుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టింది. ఇంకా షేర్ పరంగా దాటలేదు కానీ సాధ్యమయ్యేలా ఉందని ట్రేడ్ పండితుల అంచనా.
నెక్స్ట్ ప్రభాస్ నుంచి రాబోయే లిస్టులో ముందు వరసలో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ ది రాజా సాబ్. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఒకప్పటి వింటేజ్ డార్లింగ్ చూపిస్తానని మారుతీ పలు సందర్భాల్లో హామీ ఇవ్వడంతో అభిమానుల అంచనాలు దీని మీద మాములుగా లేవు. కల్కి ఫలితం చూశాక ఒక్కసారిగా రాజా సాబ్ మీదున్న డిమాండ్, హక్కుల కోసం వస్తున్న ఫోన్ కాల్స్ అమాంతం ఎక్కువయ్యాయని ఇన్ సైడ్ టాక్.
ఇది ముందే ఊహించిందే అయినప్పటికీ జాక్ పాట్ అనే పదం వాడకం వెనుక కారణం ఉంది. రాజా సాబ్ కల్కి లాగా ఆరేడు వందల కోట్లతో రూపొందింది కాదు. దానిలో సగమే మారుతీ సబ్జెక్టు డిమాండ్ చేయడంతో ఆ మేరకు ఖర్చు చేశారు. కానీ బిజినెస్ మాత్రం కల్కి స్థాయిలో ఉండబోయేది మాత్రం నిజం. పైగా నార్త్ బయ్యర్లు పెద్ద ఎత్తున రేట్లు ఆఫర్ చేస్తారు. విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో డీల్స్ ఫైనల్ కాలేదు. 2025 సంక్రాంతి లేదా వేసవి వైపు చూస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒకటి లాక్ చేసుకుని డార్లింగ్ పుట్టిననేల అక్టోబర్లో ప్రకటించే అవకాశముంది.
This post was last modified on July 2, 2024 11:40 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…