‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టడానికి రాజమౌళి సన్నాహాల్లో వుండగా, అక్టోబర్‍లో షూటింగ్ మొదలు పెట్టేటట్టయితే డిసెంబర్ వరకు తన డేట్స్ ఇస్తానని ఆలియా భట్ చెప్పిందట. జనవరి నుంచి తనకు వేరే సినిమాల కమిట్‍మెంట్స్ వున్నాయని, అప్పుడు తన డేట్స్ ఇవ్వడం కష్టమవుతుందని, కనుక తన పోర్షన్ మాగ్జిమమ్ ఇప్పుడే షూట్ చేసేస్తే మంచిదని సూచించిందట.
ఆలియాతో చేయాల్సిన షూటింగ్ కనుక రాజమౌళి అక్టోబర్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఎన్టీఆర్ ప్లాన్స్ అప్‍సెట్ అయిపోతాయి. ఎందుకంటే షూటింగ్ మళ్లీ మొదలు కాగానే ముందుగా ఎన్టీఆర్ పోర్షన్స్ పూర్తి చేసేసి అతడికి ఫిబ్రవరి నాటికి మరో సినిమా చేసుకునేలా చూద్దామని రాజమౌళి భావించాడు. అదే నమ్మకంతో త్రివిక్రమ్ కూడా తారక్ కోసం వేచి చూస్తున్నాడు. ఒకవేళ ఆలియాతో షూట్ ముందుగా అనుకుంటే చరణ్ సీన్స్ ముందు షూట్ చేయాల్సి వస్తుంది.
అప్పుడు ‘ఆచార్య’లో చరణ్ పార్ట్ షూటింగ్ మరింత డిలే అవుతుంది. డిసెంబర్ తర్వాత ఆలియా డేట్స్ దొరకవని అనుకుంటే ఆమెను మార్చి వేరొకరిని తీసుకుంటారా లేక ఈ ఇద్దరు హీరోల ముందస్తు ప్లాన్స్ అన్నీ అప్‍సెట్ చేస్తారా అనేది త్వరలో తెలిసిపోతుంది.
This post was last modified on September 22, 2020 10:39 pm
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…