Movie News

జూనియర్ బాలయ్యకు రంగం సిద్ధం

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నటనకు సంబంధించిన శిక్షణతో పాటు పూర్తి మేకోవర్ తో రెడీ అయ్యాడని సమాచారం. సోషల్ మీడియాలో తన కొత్త లుక్ ఒకటి వైరలవుతోంది. 2025లో లాంచ్ చేయడానికి బాలకృష్ణ ప్లానింగ్ లో ఉన్నారు. కాకపోతే కథ, దర్శకుడు ఇంకా లాక్ చేయలేదు.

పలువురితో చర్చలు జరుపుతున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. స్వంత బ్యానర్ కాకుండా మహేష్ బాబు, రామ్ చరణ్ లాగా వైజయంతి లాంటి పెద్ద బ్యానర్ ద్వారా పరిచయం చేయాలనేది బాలయ్య ఆలోచనగా సన్నిహితుల మాట.

ఒకవేళ అలా సాధ్యం కాని పక్షంలో మోక్షజ్ఞ అక్కయ్యలు బ్రాహ్మణి, తేజస్విని నిర్మాణ సారధ్యం వహించి తమ్ముడిని తెరకు పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మరో టాక్ ఉంది. తేజస్విని ఇప్పటికే తండ్రికి సంబంధించిన వ్యవహారాలను అన్ స్టాపబుల్ షో నుంచి బోయపాటి శీను సినిమా వరకు దగ్గరుండి చూసుకుంటోంది.

ఏపీలో కూటమి పాలన వచ్చేసింది కనక బ్రాహ్మణి కూడా బిజినెస్ లో బిజీ అయిపోయింది. ఒకవేళ అవసరం అనుకుంటే మోక్షజ్ఞ కోసం ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందట. వీటికి సంబంధించి అంతర్గతంగా డిస్కషన్లు జరుగుతున్నాయట.

కొంత ఆలస్యమైనా మోక్షజ్ఞ రావడానికి ఇదే సరైన సమయం. బాలయ్య ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నా ఆయన వారసుడి కోసం ఫ్యాన్స్ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. మొదట్లో యాక్టింగ్ పట్ల ఆసక్తి లేనట్టు బయట కనిపించినా చివరికి నిర్ణయం మార్చుకుని తనను తాను బాగా సానబెట్టుకున్నట్టు తెలిసింది.

నందమూరి కొత్త తరంలో మోక్షజ్ఞతో పాటు హరికృష్ణ గారి మనవడు ఇంకో ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి తెరంగేట్రం చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. ఎవరు ముందు వస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ కనీసం ఏడాదికి పైగానే పడుతుంది.

This post was last modified on July 1, 2024 10:47 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

7 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

8 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

9 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

9 hours ago