‘కల్కి’ సినిమాలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన పాత్రల్లో కమల్ హాసన్ చేసిన సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ ఒకటి. రిలీజ్‌కు ముందు ఈ పాత్ర మీద మరీ అంచనాలేమీ లేవు. కానీ సినిమాలో దాని ఇంపాక్ట్ బాగానే కనిపించింది. ఐతే కమల్ పాత్రకు స్క్రీన్ టైం చాలా తక్కువ. మహా అయితే ఓ అయిదు నిమిషాలు మాత్రమే కనిపించి ఉంటాడేమో. దానికి రెండే రెండు సీన్లు పెట్టారు. కానీ ఆ రెండు సీన్లలోనూ సుప్రీమ్ యాస్కిన్ పాత్ర ప్రేక్షకులకు ఒక రకమైన భయం కలిగించింది.
తొలి సన్నివేశంలో అక్కడున్నది కమల్ అన్న ఆలోచనే రాని విధంగా అస్థిపంజరం తరహాలో ఆ పాత్ర కనిపించింది. కానీ కమల్ తన గాత్రంతోనే ఆ పాత్ర పట్ల ఒక భయం కలిగేలా చేశాడు. చివరి సన్నివేశంలో ఆయన రూపం మారి కమల్‌ను గుర్తు పట్టేలా కనిపించింది. చివర్లో చెప్పిన డైలాగులు వింటే.. ‘కల్కి-2’లో సుప్రీం యాస్కిన్ పాత్ర మీద అంచనాలు పెరుగుతాయనడంలో సందేహం లేదు.
‘కల్కి’ సినిమా పార్ట్-1లో కమల్ పాత్ర, దాని ప్రభావం తక్కువగానే ఉంటాయని ముందు నుంచే సంకేతాలు వచ్చాయి. ఆ పాత్ర సెకండ్ పార్ట్‌లో ఫుల్ లెంగ్త్‌లో ఉంటుందని.. సినిమా అంతా కమల్ కనిపిస్తారని యూనిట్ వర్గాలు చెప్పాయి. పార్ట్-1లో తక్కువ స్క్రీన్ టైంతోనే సుప్రీం యాస్కిన్ పాత్ర ఇంపాక్ట్ చూపించగలిగింది. కమల్ స్థాయి నటుడికి ఇలాంటి పాత్ర ఇచ్చి.. ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తే ఆయన చెలరేగిపోతారనడంలో సందేహం లేదు.
పార్ట్-1లో ప్రభాస్-అమితాబ్ బచ్చన్ పోరు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. కానీ అమితాబ్ ఇక్కడ విలన్ కాదు. పార్ట్-2లో కమల్‌తో ప్రభాస్ పోరు ఒక రేంజిలో ఉంటుందని అంటున్నారు. పైగా అక్కడ ప్రభాస్ పోరాడేది విలన్‌తో. కాబట్టి తెర మీద భారీ విధ్వంసమే చూడబోతున్నామన్నమాట. సినిమాకు వారి ఫైటే మేజర్ హైలైట్‌గా నిలిచే అవకాశాలున్నాయి.
This post was last modified on June 28, 2024 9:15 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…