Movie News

ఓటిటి బాట పట్టిన సుమంత్ సినిమా

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ఇండస్ట్రీకి వచ్చిన సుమంత్ కెరీర్ ప్రారంభంలో చెప్పుకోదగ్గ మంచి సినిమాలే చేశాడు. డెబ్యూ మూవీ ప్రేమకథ ఫెయిలైనా సత్యం సూపర్ హిట్ తో పాటు గోదావరి విజయం మంచి అవకాశాలు తీసుకొచ్చింది. కమర్షియల్ గా ట్రై చేసిన గౌరీ, మహానంది లాంటివి సైతం థియేట్రికల్ రెవెన్యూలు తీసుకొచ్చాయి. ఆ తర్వాత వరస ఫ్లాపులు సుమంత్ ని పరిశ్రమకు దూరం చేశాయి. వైవాహిక జీవితంలో తలెత్తిన ఇబ్బందులు మరింత కృంగదీశాయి. దీంతో చాన్నాళ్ల పాటు నటనకు దూరంగా ఉండి 2017లో మళ్ళీ రావాతో సక్సెస్ అందుకుని తిరిగి ట్రాక్ లో పడ్డాడు.

కట్ చేస్తే పరాజయాల పరంపర మళ్ళీ కొనసాగింది. సుబ్రమణ్యపురం కష్టం మీద గట్టెక్కగా ఇదం జగత్, కపటధారి డిజాస్టరయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో వేసిన తాతయ్య పాత్ర పేరు తీసుకురాలేదు. సీతారామం, సార్ లో మంచి క్యారెక్టర్లు దక్కాయి. అనగనగా ఒక రౌడీ అనే మాస్ సినిమా ఒకటి తీశారు కానీ ఫస్ట్ లుక్ వదిలాక దాని పరిస్థితి ఏంటో దర్శక నిర్మాతలు చెప్పడమే మానేశారు. ఇదిలా ఉండగా సుమంత్ మరో కొత్త మూవీ అహం రీబూట్ థియేటర్ రిలీజ్ వద్దనుకుని ఓటిటి బాట పట్టింది. ఆహాలో జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు ట్రైలర్ తో పాటు అధికారిక అప్డేట్ వచ్చేసింది.

మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సుమంత్ లాంటి హీరోలు నటులకు డిజిటల్ రిలీజులే కరెక్ట్. జనాలు థియేటర్ కు రావాలంటే బలమైన కారణాలు, కంటెంట్ డిమాండ్ చేస్తున్నారు. అంతే తప్ప తెలుసు కదాని టికెట్లు కొనే పరిస్థితి లేదు. అహం రీ బూట్ ఏదో ఆసక్తి రేపెలానే ఉంది. ప్రశాంత్ సాగర్ దర్శకత్వం వహించాడు. కిడ్నాప్ కు గురైన ఓ అమ్మాయి ఆర్జెకు ఫోన్ చేస్తే ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించారు. హీరోగా ఇకపై వేగం కష్టమే కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమంత్ ఎక్కువ క్యారెక్టర్లు చేయడం ద్వారా ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యే అవకాశాలు బోలెడున్నాయి.

This post was last modified on June 28, 2024 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

48 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

51 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

55 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

1 hour ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

1 hour ago