చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి చూస్తున్న తరుణంలో కల్కి 2898 ఏడికి వస్తున్న భారీ స్పందన థియేటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే రికార్డుల మోత మొదలుపెట్టిన ప్రభాస్ తన మొదటి అడుగుని నార్త్ అమెరికాలో ఆర్ఆర్ఆర్ ని దాటేయడం నుంచి మొదలుపెట్టాడు. ట్రిపులార్ మైలురాయిని తేలికగా అందుకోవడమే కాదు రెండో రోజు అడుగు పెట్టే సమయానికే నాలుగు మిలియన్ డాలర్లు క్రాస్ చేయడం ద్వారా రాబోయే ప్యాన్ ఇండియా సినిమాలకు కొత్త సవాల్ విసిరాడు. ఇండియా బిగ్గెస్ట్ ఓపెనర్ గా కల్కి మొదలుపెట్టిన వీరవిహారం ఆషామాషీ కాదు.
గత ఇరవై నాలుగు గంటల్లో ఒక్క బుక్ మై షో యాప్ లోనే 1.12 మిలియన్ టికెట్లు అమ్ముడుపోవడం ముందు అరాచకం పదం చిన్నదే. అన్ని భాషలు కలిపే అయినప్పటికీ డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. ట్రేడ్ టాక్ ప్రకారం కల్కి 2898 ఏడి మొదటి రోజు దేశవ్యాప్తంగా 110 కోట్లు, వరల్డ్ వైడ్ మొత్తం 170 కోట్ల గ్రాస్ సాధించినట్టు రిపోర్ట్. ఒక్క నైజామ్ నుంచే ఇరవై నాలుగు కోట్ల వసూళ్లు వచ్చినట్టు సమాచారం. సీడెడ్ అయిదు కోట్లతో కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ ఇంకో మూడు రోజులు వీకెండ్ ఉంది కాబట్టి ఫిగర్స్ భారీ ఎత్తున నమోదు కాబోతున్నాయి.
వర్కింగ్ డే గురువారం రిలీజ్ కావడంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, ఇండియా ఇంగ్లాండ్ సెమి ఫైనల్ మ్యాచ్, భారీ టికెట్ రేట్లు ప్రభావం చూపించిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి శని ఆదివారాల్లో మంచి మద్దతు దక్కేలా ఉంది. కాకపోతే తెలంగాణకు పోటీగా అంతకంటే ఎక్కువ టికెట్ రేట్ హైక్ ఏపీలో రావడం బిసి సెంటర్స్ లో ఎఫెక్ట్ ఇచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల షేర్ ఎనభై కోట్ల దగ్గరగా వెళ్లడం శుభ పరిమాణం. వీకెండ్ మొత్తం డార్లింగ్ కంట్రోల్ లోనే ఉండబోతోంది కనక రికార్డుల ఊచకోత గురించి పూర్తి స్పష్టత సోమవారం వచ్చేస్తుంది.
This post was last modified on June 28, 2024 12:50 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…