భారీ ఓపెనింగ్స్ తో కల్కి 2898 ఏడి గ్రాండ్ గా మొదలయ్యింది. హనుమాన్, గుంటూరు కారం తర్వాత థియేటర్ల దగ్గర పెద్ద ఎత్తున జనం కనిపించడం చూసి బయ్యర్ల ఆనందం అంతా ఇంతా కాదు. టాక్ లో తక్కువ శాతం మిశ్రమత ఉన్నప్పటికీ అదేమీ వసూళ్ల మీద ప్రభావం చూపించేలా లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ డీల్ చేసిన విధానం పిల్లా పెద్దా తేడా లేకుండా అందరినీ మెప్పిస్తోంది. ఊహించని క్యామియోలు ఎన్నో పెట్టడంతో ఆయా అభిమానులు తెరమీద చూసి షాక్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల లీక్ ప్రభాస్ ముందే చెప్పిన సంగతి తెలిసిందే.
రాజమౌళి ఒక చిన్న యాక్షన్ ఛేజ్ లో తళుక్కున మెరవగా ఒక కామెడీ సన్నివేశంలో రామ్ గోపాల్ వర్మ నవ్వులు పూయించారు. కాస్త తీక్షణంగా చూస్తే తప్ప ఒక ఎపిసోడ్ లో ఫరియా అబ్దుల్లా ఉన్న సంగతిని పసిగట్టలేం. అనుదీప్ అలా ఒక బిట్ లో కనిపించి కనిపించినట్టు మాయమైపోతాడు. నాగ్ అశ్విన్ తన సర్కిల్ లో అవకాశమున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టినట్టు కనిపించలేదు. మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్, మాళవిక నాయర్ కథతో సంబంధం ఉన్నప్పటికీ వాళ్ళు కనిపించేది కూడా కాసేపే. మలయాళీ నటి అన్నా బెన్ కు అందరికంటే కాస్త ఎక్కువ నిడివి దొరికి తనదైన శైలిలో మెప్పించింది.
వీటిలో ఎవరివి పేలాయో ఎవరివి పేలలేదో క్రమంగా ఆడియన్స్ రియాక్షన్స్ బయటికి వచ్చేకొద్దీ తెలుస్తుంది కానీ నాగ్ అశ్విన్ ఇన్నేసి అతిథి పాత్రలు రాసుకోవడం మాత్రం షాకే. కాకపోతే దుల్కర్ ని ఇంకొంచెం బెటర్ గా వాడుకుని ఉండాల్సిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లలో ఇన్నేసి గెస్టులున్న ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి ఒక్కటే. అసలు వీళ్ళ పారితోషికాలకు ఎంత బడ్జెట్ పెట్టి ఉంటారోననేది ఇంటరెస్టింగ్ టాపిక్. లెక్కలు పక్కనపెడితే చాలా మంది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగం కావాలనే ఉద్దేశంతోనే చేశారని చెప్పొచ్చు.
This post was last modified on June 27, 2024 5:30 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…