దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాక తొమ్మిదేళ్ల ప్రయాణంలో తీసింది రెండే సినిమాలు. మొదటిది ఎవడే సుబ్రహ్మణ్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు కమర్షియల్ గానూ మంచి విజయం అందుకుంది. విజయ్ దేవరకొండలోని నటుడిని బయటికి తీసుకొచ్చి నాని స్టామినాని పెంచింది.
కట్ చేస్తే మహానటి ద్వారా ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని సావిత్రి గారి జీవితాన్ని ఆవిష్కరించిన తీరు జనరేషన్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని థియేటర్లకు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి 2898 ఏడి అనే ఆరు వందల కోట్ల మహాయజ్ఞం ద్వారా నాగఅశ్విన్ చేసిన ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి.
ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళతో శేఖర్ కమ్ముల దగ్గర పని చేయాలని ప్రయత్నించారు నాగఅశ్విన్. వెంటనే అది సాధ్యపడకపోవడంతో నేను మీకు తెలుసాకు అసిస్టెంట్ గా పని చేశాక లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు ఛాన్స్ దొరికింది. ఈలోగా ఒక మంచి షార్ట్ ఫిలింకు స్క్రిప్ట్ రాసుకున్న నాగఅశ్విన్ దాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో స్వప్న సినిమా అధినేతలు ప్రియాంక, స్వప్న దత్ ల దృష్టిలో పడ్డాడు. అలా ఎవడే సుబ్రహ్మణ్యంకు శ్రీకారం జరిగింది. అది విజయవంతమయ్యాక తానెంతో అభిమానించే సావిత్రి గాథని స్క్రీన్ మీద చూపించాలన్న తాపత్రయంని అద్భుతంగా నెరవేర్చుకుని బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రూపంలో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న ఒక విజువల్ గ్రాండియర్ ని ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి నాగఅశ్విన్ ఇప్పటిదాకా ఒక స్టార్ హీరోతో వందల కోట్ల మార్కెట్ చేసే కమర్షియల్ సినిమా చేయలేదు. ప్రభాస్ కోసమే రాసుకున్నట్టు కల్కిని ఊహించిన విధానం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలను సైతం ఇందులో భాగమయ్యేలా చేసింది. ప్రాంతంతో సంబంధం లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సునామి సృష్టిస్తున్న కల్కి మాట్లాడకుండా తెగమోహమాట పడే ఒక క్రియేటివ్ జీనియస్ నాగ అశ్విన్ ఉండటమే ఆశ్చర్యం.
This post was last modified on June 26, 2024 2:37 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…