ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలకు ఇంకొక్క రోజే సమయం ఉంది. కొన్ని వారాల ముందు పరిస్థితి చూస్తే.. సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదని, సరైన హైప్ క్రియేట్ చేయలేకపోయారని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఫీలవుతూ ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు చూస్తే సినిమాకు హైప్ వేరే లెవెల్లో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆ విషయం స్పష్టంగా కనిపించింది.
ఈ సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ.. ఒక వరల్డ్ క్లాస్ విజువల్ వండర్ చూడబోతున్నామనే ఫీలింగే ఎక్కువ ఎగ్జైట్ చేస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా టికెట్లు కొనడానికి ఎగబడ్డారు. ఈ హైప్‌ను టీం కూడా బాగానే క్యాష్ చేసుకుంటోంది. మామూలుగానే పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం ఉండగా.. ‘కల్కి’ ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్లో తెరకెక్కిన చిత్రం కావడంతో అదనపు రేట్లు ఇంకొంచెం ఎక్కువే ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌తో రెండు వారాల పాటు రూ.75 నుంచి రూ.125 వరకు అదనపు రేటు పెట్టుకునే అవకాశం లభించింది. దీనికి తోడు తెలంగాణలో తెల్లవారుజామున షోకు రూ.200 అదనపు రేట్లు పెంచారు. దాదాపుగా తెలంగాణలో ఉన్న ప్రతి థియేటర్లో తెల్లవారుజామున షోలు వేస్తున్నారు. ఇది ‘కల్కి’ కలెక్షన్లకు పెద్ద బూస్ట్ అనడంలో సందేహం లేదు. మామూలుగా ఉన్న హైప్‌కి, అదనపు రేట్లు తోడవుతుండడంతో కలెక్షన్ల పరంగా ‘కల్కి’కి ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు.
తెలుగు రాష్ట్రాల వరకే తొలి రోజు ‘కల్కి’ 60-70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. హిందీ వెర్షన్ ఇండియాలో రూ.25-30 కోట్ల మధ్య తొలి రోజు వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఇంకా కర్ణాటకలో తెలుగు వెర్షనే వసూళ్ల మోత మోగించడం ఖాయం. ఇంకా కేరళ, తమిళనాడు ఉన్నాయి. వరల్డ్ వైడ్ సినిమా భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో తొలి రోజే ఓవరాల్ వసూళ్లు రూ.200 కోట్ల మార్కును అందుకుంటాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 26, 2024 8:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…