కరోనా-లాక్ డౌన్ కారణంగా ఐదారు నెలలు షూటింగ్‌లు ఆపేశారు సినీ జనాలు. ఎట్టకేలకు ఈ మధ్యే చిత్రీకరణలు పున:ప్రారంభం అయ్యాయి. గత రెండు మూడు వారాల్లో చాలా సినిమాలు తిరిగి సెట్స్ మీదికి వెళ్లాయి. ఈ వరుసలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ కూడా వచ్చేసింది. సోమవారమే ఈ చిత్ర షూటింగ్‌ను తిరిగి ఆరంభించారు. ఐతే కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే కొత్త షెడ్యూల్‌కు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. అతను లేకుండానే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
నిన్న రాత్రి లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అందులో దర్శకుడు వేణు శ్రీరామ్, కెమెరామన్‌లతో పాటు ముగ్గురు నలుగురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. లొకేషన్లో వీళ్లతో పాటు ఒక లగ్జరీ కారు మాత్రమే కనిపిస్తోంది.
ఈ దృశ్యం చూస్తే ‘వకీల్ సాబ్’ ఒరిజినల్ ‘పింక్’లో కొన్ని సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ముగ్గురు అమ్మాయిల మీద కొందరు కుర్రాళ్లు లైంగిక వేధింపులకు పాల్పడితే.. అమ్మాయిల వైపు నిలిచి సంబంధిత కేసును వాదించే లాయర్ కథ ఇది. ఒరిజినల్లో హీరో తెరపైకి రావడానికి ముందు కొంత కథ నడుస్తుంది. సంబంధిత సన్నివేశాలే ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్లు అర్థమవుతోంది.
‘వకీల్ సాబ్’ చిత్రీకరణ అంతా పవన్ డేట్లను బట్టే సాగుతోంది. మొదటి నుంచి ఆయన అందుబాటులోకి వచ్చినపుడల్లా తనపై సన్నివేశాలు తీస్తూ వస్తున్నారు. ముందు ఆయన పార్ట్ పూర్తయితే.. తర్వాత మిగతా వాటి సంగతి చూద్దామన్నట్లు నడుస్తోంది వ్యవహారం. కరోనా నేపథ్యంలో పవన్ కొంచెం ఆలస్యంగా సెట్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఈలోపు ఆయనతో సంబంధం లేని సన్నివేశాలన్నీ పూర్తి చేసేయాలని చిత్ర బృందం భావించినట్లుంది. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
This post was last modified on September 22, 2020 2:01 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…