ప్రభాస్ నటించిన మెగా మూవీ కల్కి 2898 ఏడీ విడుదలకు ఇంకో మూడు రోజులే సమయం ఉండగా.. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పెద్ద సినిమా, కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతాయని తెలుసు. కానీ అందరి అంచనాలను మించి పోతూ.. టికెట్ సేల్స్ విధ్వంసాన్ని తలపించాయి. 2డీ, 3డీ అని తేడా లేదు.. ఏ షో పెట్టినా నిమిషాల్లో టికెట్లు హాంఫట్ అన్నట్లే.
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న థియేటర్లకు సైతం టికెట్లు నిమిషాల్లో అమ్ముడైపోయాయి. టికెట్లు కనిపిస్తున్నాయి కదా అని కొంచెం రిలాక్స్ అయితే చాలు.. కాసేపటికే సోల్డ్ ఔట్ మెసేజ్ వచ్చేసింది. కల్కి క్రేజ్ పుణ్యమా అని బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయి క్రేజ్‌ను కల్కి టీం కూడా అంచనా వేసి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
నిజానికి కల్కి సినిమా రేంజికి తగ్గ హైప్ రాలేదంటూ కొన్ని రోజుల ముందు వరకు ట్రేడ్ వర్గాల్లో ఒక రకమైన నిరాసక్తత కనిపించింది. ఏకంగా 700 కోట్ల బడ్జెట్.. హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, విజువుల్స్.. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి స్టార్ కాస్ట్.. ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాకు బాహుబలికి సరి సమానమైన, అంతకుమించిన హైప్ రావాలి. కానీ కల్కి ఆ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకోలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సినిమాను సరిగా ప్రమోట్ చేయట్లేదని.. జనాలకు చేరువ చేయట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ నిర్మాణ సంస్థ మీద మండిపడ్డారు చాన్నాళ్ల పాటు. నిజానికి తొలి ట్రైలర్ విషయంలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయకపోవడంతో సినిమాకు రిలీజ్ టైంకి ఆశించిన బజ్ వస్తుందా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఈ సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరుగుతుండడంతో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా రికార్డులను వేటాడడం ఖాయమనే అంచనాలు కలుగుతున్నాయి.
This post was last modified on June 24, 2024 12:29 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…