ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి.. ‘పుష్ప-2’. ‘పుష్ప’ సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చినా సరే.. హిందీలో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకోవడంతో ఓవరాల్‌గా అది హిట్ మూవీగా పేరు తెచ్చుకుంది.
పుష్పకు సంబంధించి పాటలు, మేనరిజమ్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేయడంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆ అంచనాలను అందుకోవడం కోసం సుకుమార్ అండ్ టీం చాలా టైం తీసుకుని, కష్టపడి పుష్ప-2 స్క్రిప్టు తయారు చేసింది.
అందువల్లే షూట్ అనుకున్న దాని కంటే ఆలస్యంగా మొదలైంది. సినిమా సెట్స్ మీదికి వెళ్లాక కూడా సుకుమార్ తనదైన శైలిలో చిత్రీకరణ సాగించడంతో షెడ్యూళ్లు అనుకున్న ప్రకారం సాగలేదు.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరున్న సుకుమార్.. అంచనాలను మించి సినిమాను తీయాలన్న తపనతో బాగా ఆలస్యం చేసేశాడు. దీంతో ఆగస్టు 15 నుంచి సినిమా వెనక్కి వెళ్లిపోయింది. డిసెంబరు 6ను కొత్త రిలీజ్ డేట్‌గా ఎంచుకున్నారు.
ఐతే ఈసారి సినిమాను వాయిదా వేయడంతో సుకుమార్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. బన్నీ ఫ్యాన్స్ సహా అందరూ ఆయన్ని తిడుతున్నారు. సుకుమార్ ఏమైనా ‘బాహుబలి’లా ఎపిక్ మూవీ తీస్తున్నాడా ఇంత ఆలస్యం చేయడానికి.. అంతగా ఆయన ఏం అద్భుతాలు చేసేస్తున్నాడో అనే చర్చ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ నడిచింది.
ఈ నేపథ్యంలో సినిమాలో కంటెంట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా సుకుమార్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇదిలా ఉంటే.. ఇలీవల రాజకీయ కారణాలతో అల్లు అర్జున్ మెగా అభిమానుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వారాల నుంచి అతడి మీద ట్రోలింగ్ నడుస్తోంది. ‘పుష్ప-2’ వాయిదా వేయడానికి ఇది కూడా ఒక కారణం అనే చర్చ కూడా జరుగుతోంది. ఆగస్టు 15న కనుక సినిమాను రిలీజ్ చేస్తే నెగెటివిటీ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ డిసెంబరు నాటికైనా ఈ నెగెటివిటీ తగ్గుతుందా అన్నది డౌట్. ఒకవేళ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోతే.. ట్రోలింగ్ ఒక రేంజిలో ఉంటుందనే భయం టీంను వెంటాడుతోంది. ఈ కారణాల వల్ల సుకుమార్ మీద టన్నుల కొద్దీ ప్రెజర్ పెరుగుతోందనడంలో సందేహం లేదు. ఆయన కచ్చితంగా ఒక ట్రూ బ్లాక్‌బస్టర్ ఫిలింను డెలివర్ చేయాల్సిందే.
This post was last modified on June 23, 2024 4:57 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…