వచ్చే వారం విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడి విడుదల కోసం ప్రభాస్ అభిమానులే కాదు సగటు సినీ ప్రేక్షకులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. బిగ్ స్క్రీన్ కు సరైన అర్థం తెలిపే రీతిలో దర్శకుడు నాగఅశ్విన్ కొత్త అనుభూతి ఇస్తాడనే నమ్మకం అందరిలో బలంగా ఉంది. ఇదిలా ఉండగా రెండు ట్రైలర్లతో చూచాయగా కథకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పిన వైజయంతి బృందం ఊహించని బోలెడు సర్ప్రైజులు ఆడియన్స్ కోసం దాచి ఉంచింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని దాగేవి కాదు. వాటిలో సీతారామం జోడి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఉన్నారు.
లీకైన ఇన్ఫోని బట్టి వీళ్ళిద్దరూ ఇందులో కల్కి తల్లితండ్రులుగా కనిపిస్తారని తెలిసింది. విష్ణుయశస్, సుమతిలుగా ప్రాధాన్యం కలిగిన పాత్రల్లో కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారట. ఒకవేళ కల్కి ప్రభాస్ అయితే ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారనుంది. మరి దీపికా పదుకునే, మాళవిక నాయర్ లు సైతం గర్భిణులుగా ఉన్న షాట్స్ ని ట్రైలర్ లో చూపించారు కాబట్టి అసలు ట్విస్టు ఏంటనేది తెరమీద చూడాలి. ఏ మాత్రం అంచనాలకు, స్పెకులేషన్లకు అందని విధంగా తెరమీద నాగఅశ్విన్ ఇవ్వబోయే సర్ప్రైజులకు మతులు పోవడం ఖాయమని వినికిడి.
ఇంకా నాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి తదితరులు కూడా ఉన్నారనే ప్రచారం బలంగా జరుగుతున్న నేపథ్యంలో సినిమా చూస్తున్నప్పుడు ఇవన్నీ నిజమైతే కనక ఈ థ్రిల్స్ కి ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయం. నైజామ్ లో థియేటర్ల కేటాయింపు జరుగుతోంది. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల వ్యవహారం తేలాక ఏపీకి సంబంధించిన లిస్టు బయటికి వస్తుంది. ఇంకో అయిదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వీలైనంత త్వరగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం తొందరలోనే ఉన్నారు కానీ ఇంకో రెండు రోజులు ఆగక తప్పేలా లేదు.
This post was last modified on June 22, 2024 1:21 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…