పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రేమించి సహజీవనం చేసి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది హీరోయిన్ రేణూదేశాయ్. విడాకులు తీసుకుని విడిపోయిన ఇద్దరూ ఎవరికి వారు జీవిస్తున్నారు. పిల్లలు ఇద్దరూ ఇద్దరి వద్ద పెరుగుతున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, పవన్ ఘనవిజయం సాధించారు. పవన్ ఏపీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఆమెను ఉద్దేశించి అన్ లక్కీ అనడంపై ఆమె తీవ్రంగా స్పందించింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌ని మీరు అన్‌లక్కీ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమె ఆ కామెంట్‌కి హర్ట్ అయ్యారు. స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. “నేను ఎలా అన్‌లక్కీ అనేది ఒకసారి చెబుతారా? మీ సమాధానం కోసం ఎదుచూస్తున్నా” అంటూ రేణూ దేశాయ్ రిప్లయ్ ఇవ్వడం మాత్రమే కాదు ఈ కామెంట్లను స్క్రీన్ షాట్ తీసి మరో పోస్ట్ కూడా పెట్టారు.
“నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకున్నంత మాత్రాన నన్ను అన్‌లక్కీ అంటూ కొంతమంది సంవత్సరాలుగా చేస్తున్న కామెంట్లు వినీవినీ నాకు బాధగా ఉంది, అలానే విసుగొచ్చింది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ఎందుకు మీరు ముడి పెడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. నాకు జీవితంలో దక్కిన ప్రతి విషయానికి నేను చాలా కృతజ్ఞురాలిని అని పేర్కొన్న ఆమె లేని దాని గురించి నాకు ఏ బాధ లేదు, కనుక విడాకులు తీసుకున్న ఏ మహిళా, పురుషుడు కూడా వాళ్ల పెళ్లి వర్కవుట్ అవనంత మాత్రాన దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలని ఆమె అన్నారు.”
“మనం 2024లో ఉన్నాం, ఒక వ్యక్తి అదృష్టాన్ని తన విడాకుల వలన విడిపోయిన లేదా చనిపోయిన భాగస్వామితోనే ముడిపెట్టడం ఇకనైనా ఆపండి, ఇప్పటికైనా సమాజం మారాలి. విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడండి.. వారివారి టాలెంట్, కృషి ఆధారంగా మాత్రమే గుర్తింపు ఇవ్వండి. ఒకప్పటి ఆలోచనల్ని పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోండి.” అంటూ రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించారు.
This post was last modified on June 21, 2024 5:53 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…