ఇప్పుడున్న హీరోల్లో మోస్ట్ ప్రామిసింగ్ మార్కెట్ ఉన్నవాడిగా అడివి శేష్ కు ప్రేక్షకుల్లోనే కాదు ఇటు ఇండస్ట్రీలోనూ మంచి గౌరవముంది. ఎంత ఆలస్యమైనా క్వాలిటీ కోసం తప్ప ఇంక దేనికోసం రాజీపడని ఈ గూఢచారి ప్రస్తుతం దాని సీక్వెల్ తో పాటు డెకాయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత చిత్రం హిట్ 2 ది సెకండ్ కేస్ మంచి విజయం అందుకున్నాక చెప్పుకోదగ్గ గ్యాపే ఇచ్చాడు. మేజర్ సక్సెస్ చూసి ఎందరో బాలీవుడ్ నిర్మాతలు ఆఫర్లు ఇచ్చినా నో చెబుతూ వచ్చాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన పేరు వెనుక ఉన్న ఒక గమ్మత్తైన కథబి చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఇతని అసలు పేరు సన్నీ చంద్ర. తండ్రి క్రికెటర్ సునీల్ గవాస్కర్ వీరాభిమాని కావడంతో అలా కలిసొచ్చేలా పెట్టుకున్నాడు. కానీ అమెరికాలో ఉన్న టైంలో సన్నీ డిలైట్ అనే జ్యూస్ ఉండటంతో స్నేహితులు ఎగతాళి చేసేవాళ్ళు. అంతేకాదు సరిగ్గా అదే సమయంలో పోర్న్ స్టార్ సన్నీ లియోన్ దూసుకురావడంతో మన సన్నీకి సమస్యలు మరింత పెరిగాయి. ఒకరకంగా ఆఫ్ లైన్ ట్రోలింగ్ అన్నమాట. దీంతో నాన్న సలహా మేరకు శేష్ గా పేరు మార్చుకుని తన తలమీద భారాన్ని తగ్గించుకున్నాడు. అయినా ఒక హీరోయిన్ పేరుతో కలుస్తోందని ఇలా చేయాల్సి రావడం బహుశా ఇది మొదటిసారి కావొచ్చు.
గూఢచారి 2, డెకాయిట్ రెండింట్లో ఒకటి ఈ సంవత్సరం విడుదల కావాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. టాలీవుడ్ డైరీ ఇప్పటికే డిసెంబర్ దాకా ఫుల్ అయిపోయింది. పైగా నిర్మాణంలో ఉన్న రెండు సినిమాలు వేగంగా జరగడం లేదు. భారీ బడ్జెట్ తో పాటు ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకునే అడివి శేష్ కమిట్ మెంట్ ఊరికే డెడ్ లైన్ల మీద పని చేయదు. సో ఎలా చూసుకున్నా తనని స్క్రీన్ మీద 2025లోనే చూడాల్సి వస్తుంది. మూడేళ్ళ గ్యాప్ అయినా సరే తగ్గేదేలే అంటున్నాడు. ఇవి కాకుండా వేరే కొత్త ప్రాజెక్టులు శేష్ ఇంకా ఫైనల్ చేయలేదు.
This post was last modified on June 21, 2024 3:52 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…