యువ కథానాయకుడు వరుణ్ తేజ్ నటించాల్సిన ఓ సినిమా విషయంలో చాన్నాళ్ల నుంచి అనుమానాలున్నాయి. అదే.. మట్కా. ‘పలాస’ దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘హాయ్ నాన్న’ నిర్మాతలు ప్రొడ్యూస్ చేయాల్సిన చిత్రమిది. ఏకంగా రూ.60 కోట్ల బడ్జెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీయాలని అనుకున్నారు.
ఐతే ఓకే అయ్యే సమయానికి అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత వరుణ్ తేజ్‌కు బాక్సాఫీస్ దగ్గర వరుసగా రెండు భారీ దెబ్బలు తగిలాయి. గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. వరుణ్ మార్కెట్ మీద అవి తీవ్ర ప్రభావమే చూపాయి. మరోవైపు దర్శకుడు కరుణ్ కుమార్ ఇప్పటిదాకా కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలు విమర్శల ప్రశంసలు అందుకున్నాయే తప్ప డబ్బులు తీసుకురాలేదు.
ఈ నేపథ్యంలో ఏకంగా 60 కోట్లు పెట్టి ‘మట్కా’ సినిమా తీస్తే వర్కవుట్ అవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు వెనుకంజ వేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. సినిమా అనౌన్స్ చేశాక నెలలు గడుస్తున్నా షూటింగ్ మొదలు కాకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా సాగింది. టీం కూడా ఈ ప్రచారాన్ని ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. వరుణ్ కొత్త ప్రాజెక్టుల గురించి వార్తలు వస్తున్నా.. ‘మట్కా’ ఊసు మాత్రం లేకపోవడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం సందేహమే అనుకున్నారంతా.
ఐతే ఎట్టకేలకు ఈ ప్రచారాలకు, సందేహాలకు తెరదించుతూ ‘మట్కా’ సెట్స్ మీదికి వెళ్లింది. సైలెంటుగా ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేసింది టీం. వరుణ్ చాలా నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు హాజరవుతున్నది ఈ చిత్రంతోనే. మరి అతడికి ‘మట్కా’ ఓ మంచి విజయాన్నందించి కెరీర్‌ను గాడిన పెడుతుందేమో చూడాలి.
This post was last modified on June 21, 2024 12:17 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…