బడ్జెట్ పరంగా చూస్తే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ని చెప్పొచ్చు. ఈ సినిమా మీద 600 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌కు తోడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు.. దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
హాలీవుడ్ స్టైల్ తగ్గని సైన్స్ ఫిక్షన్ కథకు మైథాలజీ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో తీర్చిదిద్దాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా ఫలితం కోసం టాలీవుడ్ మాత్రమే కాక మొత్తం భారతీయ సినీ పరిశ్రమ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రోమోలన్నీ బాగున్నాయి. విజువల్స్ అదిరిపోయాయి. అయినా సరే ‘కల్కి’ ఫలితం మీద సగటు ప్రేక్షకుల్లో పూర్తి భరోసా అయితే కనిపించడం లేదు.
‘కల్కి’కి సంబంధించి విజువల్స్ అన్నీ వారెవా అనిపిస్తున్నా.. ఈ సినిమా కథ విషయంలోనే జనాలకు రకరకాల సందేహాలున్నాయి. ఎన్ని ప్రోమోలు చూసినా కథేంటన్నది అర్థం కావడం లేదు. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్ రిలీజ్ ముంగిట ప్రెల్యూడ్ ద్వారా.. అలాగే ప్రి రిలీజ్ ఈవెంట్లో పూర్తి కథేంటన్నది దాదాపుగా చెప్పేశాడు. మూడు వేర్వేరు ప్రపంచాలు అంటూ వాటి గురించి వివరించాలని చూశాడు.
ఐతే అతను ఎంత విడమరిచి చెప్పినా సామాన్య ప్రేక్షకులకు ఇప్పటికైతే కథ మీద ఒక క్లారిటీ రావట్లేదు. అతను చెబుతున్న నమ్మశక్యంగా, మింగుడు పడేలా లేకపోవడమే అందుక్కారణం. కొత్తగా, క్రేజీగా కథ రాసుకోవడం ఓకే కానీ.. ఆ కథల్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా తెరపై ప్రెజెంట్ చేయడమే సవాల్. తెర మీద తాము చూసేది కన్విన్సింగ్‌గా అనిపిస్తే ప్రేక్షకులు ఆ సినిమాకు జై కొడతారు. విజువల్‌గా ‘కల్కి’ సూపర్ కాబట్టి కథ అర్థమైందంటే ఆటోమేటిగ్గా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 21, 2024 12:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…