ఓ పెద్ద సినిమా విడుదలవుతోందంటే.. ముందు, వెనుక వారాల్లో పేరున్న చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడతారు. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అదే పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు వారాల్లో వారానికి మూడు చొప్పున్న పేరున్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను మెప్పించాయి కూడా. కానీ ఈ వారం మాత్రం సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకు చాలా సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటి గురించి జనాలకు అసలు పట్టింపే లేదు.
ఉన్నంతలో కొంచెం తెలిసిన ముఖాలున్న మూవీ అంటే.. ‘నింద’నే. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ చాన్నాళ్ల తర్వాత హీరోగా నటించిన చిత్రమిది. ప్రోమోలు చూస్తే ఇదొక థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోంది. ఐతే రిలీజ్ ముందు అయితే ఈ సినిమా అంతగా జనాల దృష్టిని ఆకర్షించడం లేదు. టాక్ బాగుంటే ఏమైనా దాని వైపు చూస్తారేమో చూడాలి.
ఇక ఈ వారం బరిలో ఉన్న వేరే చిత్రాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చైతన్యరావు-హెబ్బా పటేల్ నటించిన ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’తో పాటు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర చేసిన ‘ఓఎంజీ’.. ఇంకా సీతారామ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సందేహం, పద్మవ్యూహంలో చక్రధారి లాంటి సినిమాలు చాలానే రిలీజవుతున్నాయి ఈ వారం. ఇవన్నీ రిలీజవుతున్నాయి అంటే రిలీజవుతున్నాయి అనిపించే చిత్రాలే.
‘కల్కి’ తర్వాతి వారాంతంలో కూడా పేరున్న సినిమాలు రిలీజయ్యే సంకేతాలు కనిపించడం లేదు. ఈ వారంలో మాదిరి చిన్న సినిమాలు కూడా ఏవీ షెడ్యూల్ కాలేదు ఆ వీకెండ్‌కు, కల్కి టాక్‌ను బట్టి ఏమైనా పరిస్థితి మారొచ్చు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘కల్కి’ మీదే ఉంది. ‘కల్కి’ మీద డబ్బులు కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండడంతో రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా ఈ వారం సినిమాలను ఏమేర పట్టించుకుంటారన్నది సందేహమే.
This post was last modified on June 21, 2024 12:05 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…