Movie News

అర్ధరాత్రి షోల మీద తీరని సస్పెన్స్

ఏపీలో ప్రభుత్వం మారి సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉండే టిడిపి జనసేన కూటమి వచ్చాక ఇప్పుడు అందరి కళ్ళు జూన్ 27 మీద ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి విడుదల నేపథ్యంలో దానికి రాబోయే టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల పర్మిషన్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అర్ధరాత్రి ప్రీమియర్ల మీద ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. టీమ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాత్రి 1 గంటకు షోలు వేయాలా వద్దా అనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలు జరుగుతున్నాయి.

యుఎస్ లో ప్రీమియర్లు అదే సమయానికి మొదలైపోతాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం నిద్రలేచే లోపే అక్కడి రివ్యూలు సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చి పడతాయి. అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు చూస్తుంటే బాహుబలి, సలార్ కంటే అత్యధిక శాతం ఎన్ఆర్ఐలు కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. వాళ్ళ ద్వారా వచ్చే రిపోర్టులు, స్పాయిలర్ లీకేజులు కంట్రోల్ చేయడం కష్టం. టాక్ చాలా బాగుంటే డబుల్ ప్లస్ అవుతుంది. లేదూ ఏదైనా కొంచెం అటుఇటుగా మిశ్రమంగా వినిపిస్తే ఇబ్బందే. దానికి బదులు వరల్డ్ వైడ్ ఒకేసారి షోలు పడాలంటే ఇండియా వైడ్ అర్ధరాత్రి కన్నా వేరే ఆప్షన్ ఉండదు.

తెలంగాణలో సింగల్ స్క్రీన్ల వరకు ఒంటి గంట షోలు వేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఏపీలోనూ అదే టైంకి పడాలి. అయితే నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ అశ్విన్, ప్రియాంక, స్వప్న ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఇంకో రెండు మూడు రోజుల్లో తేల్చబోతున్నారు. కొత్త ట్రైలర్ ఏ క్షణమైనా రావొచ్చు. బజ్ పరంగా అభిమానులు కొన్ని సందేహాలు పెట్టుకున్నా రిలీజ్ రోజు నాటికి థియేటర్ల దగ్గర పోటెత్తబోయే జనం ఊహకందని విధంగా ఉంటుందని బయ్యర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి వీకెండ్ రికార్డులకు పాతర వేయడం ఖాయమని చెబుతున్నారు.

This post was last modified on June 20, 2024 4:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రాజ్ తరుణ్‌పై కేసు.. ఆమెకు నోటీసులు

టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజాగా అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి రాజ్…

24 mins ago

ప్రభాస్ మీద ఇంత అభిమానమేంటబ్బా..

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ సాధించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ చూసి వేరే ప్టార్ హీరోలకు కళ్లు కుట్టి ఉంటే…

27 mins ago

మాస్ మహారాజాకు మళ్ళీ పోటీ తప్పదా

హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన మిస్టర్ బచ్చన్ విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్…

32 mins ago

చరణ్ అభిమానుల నిరీక్షణ ఫలించింది

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాడుకుంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే గేమ్ ఛేంజర్ షూటింగ్ లో తన భాగం…

2 hours ago

మీర్జాపూర్ 3 ఎలా ఉందంటే

మాములుగా వెబ్ సిరీస్ లకు క్రేజ్ రావడం అన్నింటికి జరగదు. మన దేశంలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న అలాంటి వాటిలో…

3 hours ago

నాన్న‌గారి జ‌యంతి.. స‌మాధికే ప‌రిమితం!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న తండ్రి వైఎస్సార్ జ‌యంతిని స‌మాధాకే ప‌రిమితం చేస్తున్నారు. తాజాగా ఆయ‌న సొంత…

3 hours ago