సినిమా రిలీజయ్యే వరకు కథ గురించి క్లారిటీ ఇవ్వకుండా నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని చూసే దర్శకులు కొందరైతే.. మరికొందరు మాత్రం కథేంటో ముందే క్లియర్‌గా చెప్పేసి, ప్రేక్షకులు తామేం చూడబోతున్నామో ప్రిపేర్ చేసి థియేటర్లకు తీసుకొచ్చేవారు ఇంకొందరు. దర్శక ధీరుడు రాజమౌళి రెండో కోవకే చెందుతాడు. చాలా వరకు ఆయన సినిమాల్లో కథేంటో ముందే తెలిసిపోతుంటుంది.
‘ఈగ’, ‘ఆర్ఆర్ఆర్’ సహా కొన్ని చిత్రాల కథేంటో రాజమౌళి ప్రెస్ మీట్లలోనే స్వయంగా వెల్లడించడం గుర్తుండే ఉంటుంది. మిగతా సినిమాల కథను ట్రైలర్ల రూపంలో తెలియజేశాడు. ఇప్పుడు యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ప్రేక్షకులు ‘కల్కి’లో చూడబోయేదేంటో ముందే చెప్పడానికి ప్రయత్నించాడు. ఇప్పటిదాకా రిలీజైన ‘కల్కి’ ప్రోమోలు చూస్తే కథ విషయంలో ప్రేక్షకులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఇదే కన్ఫ్యూజన్‌తో థియేటర్లలో అడుగు పెడితే కష్టమనుకున్నాడో ఏమో.. రిలీజ్ ముంగిట ఈ సినిమా కాన్సెప్ట్ సహా కొన్ని ముఖ్య విషయాలను విడమరిచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నాగి. ప్రెల్యూడ్‌లో చెప్పిందే కాక.. ముంబయిలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ కథ గురించి వివరణ ఇచ్చాడు నాగి. అతను చెప్పిన ప్రకారం.. కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య నడుస్తుంది. అందులో ఒకటి కాశి. ప్రపంచంలో ఏర్పడిన తొలి నగరంగా పేరున్న కాశి.. చివరి నగరంగా మారే పరిస్థితి ఆలోచనతోనే ఈ కథ మొదలవుతుంది.
అక్కడి ప్రజలు దుర్భర జీవనం అనుభవిస్తుంటారు. అదే సమయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ల మేర ఉండే ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలుంటాయి. కాశీ ప్రజలు కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడున్నవాటిని ఆస్వాదించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లడానికి మిలియన్ల కొద్దీ యూనిట్స్ ఉండాలి. జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు శంబాలా అనే మరో రహస్య ప్రపంచం కూడా ఉంటుంది. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ ఉంటుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతూ.. ఆ సంఘర్షణలో నడిచే కథే ‘కల్కి’ అట.
This post was last modified on June 20, 2024 11:40 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…