కల్కి సినిమా విషయంలో ముందు నుంచి ఎందుకో కొంత నిరాసక్తతతో కనిపించింది హీరోయిన్ దీపికా పదుకొనే. కల్కి అనౌన్స్‌మెంట్ టైంలో దీన్ని ప్రభాస్ సినిమాగా పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో మొదలుపెడితే.. సినిమా విడుదల దగ్గర పడుతున్నా ప్రమోషన్లలో పాల్గొనకపోవడం, సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయకపోవడంతో అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది దీపికా.
ఐతే ఇంకో ఎనిమిది రోజుల్లో కల్కి విడుదల కాబోతుండగా.. ముంబయిలో నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్లో దీపికా పాల్గొనడమే కాక సినిమా గురించి సానుకూలంగా మాట్లాడుతూ, ప్రభాస్ అండ్ కోతో కలుపుగోలుగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వేడుకకు దీపికా బేబీ బంప్‌తో హాజరైంది.
రణ్వీర్ సింగ్, దీపికా దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం ఇటీవలే వెల్లడైంది. ఆ తర్వాత దీపికా బేబీ బంప్‌తో మీడియా ముందు హాజరు కావడం ఇదే తొలిసారి. ప్రి రిలీజ్ ఈవెంట్లో స్టేజ్ మీద దీపికకు టీం మంచి ఎలివేషన్ ఇచ్చింది.
ఆమె కోసం స్పెషల్ ఏవీ కూడా రెడీ చేయించింది. ఆ వీడియో అయ్యాక దీపిక బేబీ బంప్‌తో కనిపించి చిన్న స్పీచ్ ఇచ్చింది. ప్రసంగం అయ్యాక దీపిక కిందికి దిగుతుండగా.. ప్రభాస్ ఎదురెళ్లి ఆమెకు చేయి ఇచ్చి కిందికి తీసుకురావడం విశేషం. ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్ కోసం ప్రభాస్ ఇలా చొరవ చూపించడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ప్రభాస్‌కు కౌంటర్ కూడా ఇచ్చారు. హీరోయిన్ కోసమైతే ఇంత సాయం చేస్తావా అన్నట్లు ప్రభాస్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేశారు అమితాబ్. మొత్తానికి కల్కి సినిమాకు సంబంధించి ఇన్ని రోజులు అంటి ముట్టనట్లు ఉన్న దీపికా.. రిలీజ్ టైంకి ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
This post was last modified on June 19, 2024 10:09 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…