గత కొన్ని రోజుల నుంచి పుష్ప-2 సినిమా రిలీజ్ వాయిదా గురించి పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రకటించినట్లు ఈ ఆగస్టు 15కు పుష్ప-2 వచ్చే అవకాశం లేదని కొన్ని రోజుల కిందటే తేలిపోయింది. ఐతే దాని గురించి చిత్ర బృందం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. మరి వాయిదా గురించి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారు..కొత్త డేట్ ఎప్పుడు ఉంటుంది అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే ఎక్కువ నాన్చకుండా పుష్ప-2 ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసేసింది. ఈ చిత్రాన్ని 2024 డిసెంబరు 6న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. స్వయంగా అల్లు అర్జునే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
మెడపై కత్తి పెట్టుకుని కోపంగా చూస్తున్న ఒక కొత్త లుక్‌తో బన్నీ కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. నిజానికి ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు మాత్రమే ప్రకటన ఇచ్చి.. కొత్త డేట్ తర్వాత వెల్లడిస్తామని ప్రకటన చేస్తారని ఇండస్ట్రీ జనాలు భావించారు. టీం కూడా ఒక దశలో అలాగే అనుకుంది. కానీ వాయిదా నిర్ణయం మాత్రమే ప్రకటించి కొత్త డేట్ ఇవ్వకపోతే మళ్లీ అనిశ్చితి తప్పదని.. అది ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ అసంతృప్తికి దారి తీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో కొత్త డేట్ ఫిక్స్ చేసుకున్నాకే నేరుగా ఆ మేరకు ప్రకటన చేశారు.
క్రిస్మస్ వీకెండ్లో రాకపోవడం వల్ల అప్పటికి షెడ్యూల్ అయిన వేరే చిత్రాలకు ఇబ్బంది ఉండదు. ఇంకోవైపు పుష్ప-2కి కూడా సోలో డేట్ దక్కినట్లు అవుతుంది. కాబట్టి ఎవ్వరికీ ఇబ్బంది లేకుండానే కొత్త డేట్ ఎంచుకున్నారని చెప్పొచ్చు.
This post was last modified on June 18, 2024 8:05 am
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…