గత ఏడాది షారుఖ్ ఖాన్ ఇచ్చిన రెండు ఇండస్ట్రీ హిట్లు, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ 2023 కళకళలాడింది. కానీ ఈ సంవత్సరం అలాంటి సక్సెస్ లేక ఎగ్జిబిటర్లు చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. షైతాన్, ఫైటర్ మంచి వసూళ్లు నమోదు చేయగా క్రూ లాంటి మీడియం బడ్జెట్ చిత్రాలు నిర్మాతలను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. అయితే ఇవన్నీ స్టార్లున్న సినిమాలు. ఇమేజ్, గ్లామర్ పుష్కలంగా ఉన్న నటీనటులు చేసినవి. కానీ అలాంటి ఆకర్షణలు లేకుండా ఒక పిల్ల దెయ్యం చుట్టూ నడిపించిన కథతో హిట్టు కొట్టడం సులభం కాదు. ముంజ్య అది చూపించింది.
ఇదో వెరైటీ స్టోరీ. తల్లి కట్టుబాట్ల మధ్య పెరిగిన బిట్టు(అభయ్ వర్మ) అనే కుర్రాడు ఆమెతో కలిసి స్వంత ఊరికి ఒక పెళ్లి కోసం బయలుదేరతాడు. అక్కడ ముంజ్య అని పిల్ల దెయ్యం దేని కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. బిట్టుని చూడగానే అతనికి మాత్రమే కనిపిస్తూ విచిత్రమైన హింస పెడుతుంది. దీని వెనుక 1950 నాటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మున్ని అనే అమ్మాయిని ప్రేమించిన ముంజ్య పెళ్లి చేసుకోవాలనే కోరిక తీరకుండా చిన్న వయసులోనే ఒక ప్రమాదంలో కన్ను మూస్తాడు. అక్కడే దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటాడు. బిట్టుని చూడగానే ఎందుకు వచ్చాడనేది అసలు స్టోరీ.
విఎఫెక్స్ విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ, హారర్ కామెడీనే అయినప్పటికీ దర్శకుడు ఆదిత్య సర్పోత్డర్ చూపించిన క్రియేటివిటీ రెండూ బోర్ కొట్టించకుండా సాగాయి. దెయ్యాలను వదిలించే పాత్రలో మన కట్టప్ప సత్యరాజ్ కనిపించడం విశేషం. ఆద్యంతం టైం పాస్ అయ్యేలా చేయడంలో ముంజ్య ఓ మోస్తరుగా పాసవ్వడంతో నార్త్ ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యని రెండో వారంలోనూ కొనసాగిస్తున్న ముంజ్య ఈ ఏడాది సక్సెస్ ఫుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. కొత్త రిలీజ్ చందూ ఛాంపియన్ ని తట్టుకుని మరీ కంటిన్యూ అవుతోంది.
This post was last modified on June 17, 2024 12:53 pm
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…