ప్రభాస్ ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మాత్రమే కాదు.. ఇండియాలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరో కూడా. ఈ నెలాఖరులో కల్కి మూవీతో పలకరించబోతున్న రెబల్ స్టార్.. ఈ ఏడాది చివర్లో రాజా సాబ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సలార్-2, స్పిరిట్ మూవీస్‌తో పాటు హను రాఘవపూడి చిత్రం కూడా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే.. మంచు వారి డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పలో ఓ కీలక పాత్ర చేశాడు ప్రభాస్. ముందు అది చిన్న క్యామియో రోల్ అనుకున్నారు. కానీ ప్రభాస్ లెంగ్తీ రోల్‌లోనే కనిపించబోతున్నాడని మంచు విష్ణు ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు.
ఇక టీజర్ విషయానికి వస్తే.. ప్రధానంగా కన్నప్ప క్యారెక్టర్లో మంచు విష్ణునే హైలైట్ అయినప్పటికీ.. ప్రభాస్ ఒక్క సెకనే కనిపించినా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రభాస్ ఏ పాత్ర చేస్తున్నాడు.. తన లుక్ ఏంటి రివీల్ చేయకుండా కేవలం కళ్లు మాత్రమే చూపించి అభిమానులను ఊరించారు మేకర్స్. ఐతే కేవలం కళ్లు మాత్రమే కనిపించినా.. సోషల్ మీడియాలో ఆ దృశ్యమే వైరల్ అయిపోయింది. కన్నప్ప అని హ్యాష్ ట్యాగ్ కొడితే చాలు.. ప్రభాస్ కళ్లు కనిపించిన స్క్రీన్ షాట్, షార్ట్ వీడియోనే కనిపిస్తున్నాయి.
ఈ టీజర్ ప్రదర్శించిన ఏఎంబీ సినిమాస్‌లో కూడా ప్రభాస్ కనిపించిన ఆ ఒక్క క్షణంలో రెస్పాన్స్ మామూలుగా లేదు. థియేటర్ హోరెత్తిపోయింది. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో.. కన్నప్పకు ప్రభాస్ ఎక్స్‌టెండెడ్ క్యామియో ఎంత ప్లస్ కాబోతోందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ప్రభాస్ పాత్రకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటామని విష్ణు టీజర్ లాంచ్ కార్యక్రమంలో చెప్పాడు.ఒక ఆశాజనకమైన శుక్రవారం అనడంలో సందేహం లేదు.
This post was last modified on June 15, 2024 7:29 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……