రేపు విడుదల కాబోతున్న సినిమాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. పెద్ద స్టార్ హీరోలవి కాకపోయినా మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాల కాంపిటేషన్ కావడంతో ఓపెనింగ్స్ రాబట్టుకోవడం పెద్ద సవాల్ గా మారింది. అందుకే ప్రమోషన్ల విషయంలో నటీనటులు యథాశక్తి తమకు చేతనైనంత పబ్లిసిటీలో భాగమవుతున్నారు. వాటిలో మ్యూజిక్ షాప్ మూర్తి ఒకటి.
అజయ్ ఘోష్ టైటిల్ పాత్ర పోషించగా చాందిని చౌదరి ఒక కీలక పాత్రలో నటించింది. పాత ఆడియో షాపు నడుపుకునే ఒక మధ్యతరగతి మాములు మనిషి జీవితాన్ని ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అన్ని అంశాలు దట్టించినట్టే కనిపిస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ తమ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఒకవేళ బాలేదనిపిస్తే తన నెంబర్ 92******66 కి ఫోన్ చేసి బూతులు తిట్టమని పబ్లిక్ స్టేజి మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కంటెంట్ మీద నమ్మకం ఉండటం మంచిదే.
అలా అని ఏకంగా పర్సనల్ సెల్ కాంటాక్ట్ ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. అసలే ఇది సోషల్ మీడియా కాలం. మంచి ఉద్దేశం కోసం వాడేవాళ్ళతో పాటు పనీపాటా లేని బ్యాచ్ కూడా ఇందులోనే ఉంటారు. మ్యూజిక్ షాప్ మూర్తి గురించి చెప్పకుండా అవవసరమైన మాటలను పొడిగించే వాళ్లకు కొదవే ఉండదు. కంట్రోల్ చేయడం జరగని పని.
ఇంతగా ఆయన ఓపెనవ్వడానికి కారణం లేకపోలేదు. కేవలం అజయ్ ఘోష్ పేరు మీదే టికెట్లు తెగడం కష్టం. నిజంగానే సినిమా బాగుండొచ్చు. కానీ ఇమేజ్ ఉన్న హీరోల కోసమే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటిది మ్యూజిక్ షాప్ మూర్తి కోసం పబ్లిక్ రావాలంటే ఏదో అద్భుతం జరగాలి.
అది ఉందనే నమ్మకాన్ని కలిగించేందుకే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు కానీ దానివల్ల వచ్చే తలనెప్పి ఎలా ఉంటుందో ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఒక్క పిలుపుతో అజయ్ ఘోష్ వీడియో, సినిమా రెండు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి.
This post was last modified on June 13, 2024 11:34 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…