బిగ్‍బాస్ షోలో తేజస్వి, బాబు గోగినేని లాంటి వాళ్లకు విపరీతమైన బ్యాడ్‍నేమ్ రావడంతో గత సీజన్‍లో చాలా మంది సేఫ్ గేమ్ ఆడారు. ఈ సీజన్లో కూడా ప్లేయర్స్ అంతా సేఫ్ ఆడేస్తున్నారు. ఎంత సేఫ్ అంటే… కనీసం నామినేషన్స్ అయినా తప్పించుకోవడానికి చూడట్లేదు. కెప్టెన్ పదవి కోసం కూడా పోటీ పడడం లేదు. వాళ్లంతా అలా సేఫ్ గేమ్ ఆడితే బిగ్‍బాస్ షో ఆసక్తికరంగా మారడం కష్టం.
అందుకే ఈ వీకెండ్‍లో ఆ సేఫ్ గేమ్‍కి నాగార్జునతో క్లాస్ ఇప్పించడమే కాకుండా తమ వంతుగా నాలుగైదు పుల్లలు పెట్టేసి హౌస్‍లో ప్లేయర్స్ గ్రూపులుగా విడిపోవడానికి కారణమయ్యారు బిగ్‍బాస్ షో నిర్వాహకులు. ఎవరు హీరో, ఎవరు జీరో అనే టాస్క్ వల్ల అమ్మ రాజశేఖర్, లాస్య రెండు టీమ్స్ అయిపోయాయి.
ఇన్నిరోజులు అక్కా, చెల్లీ అనుకున్న లాస్య, దివి మధ్య అగ్గి రాజుకుంది. ఇక దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేసే ప్రాసెస్‍లో మరింత మంది మధ్య పుల్లలు పెట్టేసారు. మెహబూబ్ అంటేనే హారిక రగిలిపోతోందిపుడు. ఇక టీవీ 9 దేవి కూడా అమ్మ రాజశేఖర్ ఈగోని హర్ట్ చేసింది. తాను సింపతీ గేమ్ ఆడడమే కాకుండా మిగతా వాళ్లతో కూడా సేఫ్ గేమ్ ఆడిస్తోన్న నోయెల్‍కి డోస్ గట్టిగానే పడింది.
ఇక ఇప్పుడు నామినేషన్ టాస్కులయినా, ఫిజికల్ టాస్కులయినా రసవత్తరంగా మారతాయి. ఐపీఎల్ మొదలైపోయిన దశలో తమ ఆడియన్స్ ని మిస్ చేసుకోకూడదంటే ఈమాత్రం ఘాటుండాలని బిగ్‍బాస్ మేనేజ్‍మెంట్ గుర్తించింది. ఈసారి పబ్లిక్ ఒపీనియన్ కన్సిడర్ చేస్తూ గత సీజన్లలో మాదిరిగా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి కొమ్ము కాసే పద్ధతిని కూడా విడిచి పెట్టేసింది.
This post was last modified on September 21, 2020 11:17 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…